జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష


    ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయం, తాగు నీరు, నాడు – నేడు కింద కార్యక్రమాలు, హౌసింగ్, పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు, ఉపాథి హామీ కార్యక్రమాలు, కోవిడ్‌–19 నివారణా చర్యలపై సీఎం సమీక్ష.మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, రాజ్యసభ్య సభ్యుడు వీపీఆర్, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ హాజరు.కోవిడ్‌–19 టెస్టుల పరంగా చూస్తే మనం దేశంలోనే నెంబర్‌ వన్‌: సీఎం.ప్రతి పది లక్షల జనాభాకు 2500కి పైగా టెస్టులు మనం చేస్తున్నాం. ఇది ఒక రికార్డు.35–36 రోజుల కింద మనకు స్విమ్స్‌ తప్ప మరో చోట టెస్టింగ్‌ ఫెసిలిటీ లేదు.ది కూడా 2 రోజుల తర్వాత ఫలితాలు వచ్చేవి,కానీ ఇవాళ 11 జిల్లాల్లో 12 టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి.ట్రూనాట్‌ కిట్లు కూడా అన్ని ఆస్పత్రుల్లో ఉన్నాయి.అందరూ కలిసి ఈ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకున్నాం.గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల రూపంలో మనకు బలమైన నెట్‌వర్క్‌ఉంది.కలెక్టర్లు, ఎస్పీలు చక్కటి పనితీరును చూపారు,కోవిడ్‌ను ఎదుర్కొనే విషయంలో మనం ఇతర రాష్ట్రాలకన్నా భిన్నంగా పని చేయగలిగాం.


    టెలి మెడిసిన్‌ కోసం ఒక నంబర్‌ కేటాయించాం,అలాగే ప్రతి గ్రామ సచివాలయంలో అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన నెంబర్లు.. టెలి మెడిసిన్, దిశ, అవినీతి నిర్మూలన, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన నెంబర్లు ఉండాలి.టెలి మెడిసిన్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందని అధికారులు చెప్తున్నారు.ఈ వ్యవస్థను కలెక్టర్లు తమదిగా భావించి బాగా పని చేయించాలి.అలాగే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలపై సమగ్రంగా సర్వే చేశారు.అ కుటుంబాలలో అవసరమైన వారికి పరీక్షలు నిర్వహించారు,ఇంకా 5,281 మందికి పరీక్షలు చేయాల్సి ఉంది,వీలైనంత త్వరగా వీరికి పరీక్షలు పూర్తి చేయాలి.


    జూన్‌ 1 నుంచి రైతు భరోసా కేంద్రాలు (ఆర్బేకేలు) ప్రారంభం అవుతాయి,ఈలోగా మండల, జిల్లా స్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు ఉండాలి.ఈ అడ్వైజరీ బోర్డులు సలహాలు, సూచనలు చేస్తాయి,ఏ పంట వేయాలి? ఏ పంట వేస్తే మంచి రేటు వస్తుంది? ఏ పంట వేస్తే రైతుకు సహాయపడుతుంది? కలెక్టర్లు ప్రతి రోజూ కనీసం 45 నిమిషాల పాటు వ్యవసాయం మీద సమీక్ష చేయాలి.రైతు భరోసాఇప్పటికే రూ.2వేల చొప్పున ఈ పథకంలో ఇవ్వగా, మే 15న రూ.5,500  బ్యాంకులు తమ అప్పు కింద జమ చేసుకోలేని విధంగా అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో వేస్తున్నాం,రెండో విడత రూ.4 వేలు అక్టోబరులోనూ, మూడో విడత వచ్చే జనవరిలో సంక్రాంతి పండగ సందర్భంగా రూ.2 వేల చొప్పున ఇస్తున్నాం.