సేవ కు హ్యాట్సాఫ్!!!


విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నెల్లూరు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వలస కూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి 


     కరోనా వైరస్ వల్ల వలస కూలీలకు తినటానికి తిండి లేకుండా నానా అవస్తలు పడుతుంటే వాళ్లకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నెల్లూరుజాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి జరిపి వాళ్ల కష్టం లో తోడు గా నిలిసిన విక్రమ సింహపురి  విశ్వవిద్యాలయం నెల్లూరు వారికీ మా పత్రిక తరుపున అభినందనలు.



    దూర ప్రాంతాలకు జిల్లా మీదుగా సైకిల్ మీద అలాగే కాలినడకన వెళుతున్న  వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి శిబిరాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. తదనంతరం రిజిస్ట్రార్ గారు వలస  కూలీలలకు పండ్లు , మజ్జిగ, బిస్కట్ మరియు చల్లని నీళ్ల బాటిల్స్ ను పంపిణి చేశారు. రిజిస్ట్రార్ డా. విజయ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి ఆదేశానుసారంగా మరియు జిల్లా అధికారుల అనుమతితో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.



    ఈ శిబిరం ద్వారా కోవిద్ -19 వ్యాధి వలన సంభవించిన విపత్కర పరిస్థితులలో  లక్షల మంది వలస కూలీలు  వందలు వేల కిలోమీటర్ల దూరం  లో వున్నా ఒడిస్సా , కలకత్తా  రాష్ట్రాలకు  వెళుతున్న వలస కూలీలకు విశ్వవిద్యాలయము తరపున కొంత చేయూత నివ్వటానికి జరిగింది అన్నారు. వలస కూలీల కోసం  ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న కార్యక్రమాలకు, తమవంతు సాయంగా ఉడతా భక్తి తో తాము చేస్తున్నామన్నారు. ఈ శిభిరం ఏర్పాటు చేయటానికి నిరంతరం శ్రమిస్తున్న హెల్ప్ ది నీడి  టీం ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు,ఈ కార్యమంలో  కొప్పవరపు హరినాథ్ గారు సురేష్ హెరర్స్ యాజమాన్యం,  NSS  సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, డా, మధుమతి, డా చెంచు రెడ్డి, పీఆర్వో డా కోట మణికంఠ , హెల్ప్ ది నిడి టీం సభ్యులు పార్ధసారధి, రాజేష్, అఖిల్ , చైతన్య , జూనియర్ అఖిల్ మరియు డ్రైవర్ సాగర్ పాల్గొన్నారు.