ఫైర్ ఫైర్ ఫైర్ !!!


     ఎస్పీ మీద ఫైర్ అయిన కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నేను నా నియోజక నియోజకవర్గ ప్రజలు కష్టంలో ఉంటే వాళ్లకి కూరగాయలు బియ్యము సప్లై చేస్తున్నాను, అండగా ఉంటున్నాను నేను సమదూరం పాటిస్తూ నా ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నన్ను గెలిపించిన ప్రజల కోసం కష్టపడుతునాను  దాతలు ముందుకు వస్తున్నారు. నా మీద కేసు పెట్టారు, నన్ను అరెస్టు చేయమని పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉండగా జిల్లా కలెక్టరుగారు ఫోన్ చేసి అక్కడ 144 సెక్షన్ ఉంది అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పిన మీదట కలెక్టర్ గారి మీద గౌరవంతో నేను అక్కడి నుంచి వచ్చాను. తర్వాత సీఎం ఆఫీస్ నుంచి జిల్లా  ఇన్చార్జి  బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి నేను మాట్లాడుతాను నువ్వు ఈ విషయం  ఇంక మాట్లాడొద్దని చెప్పారు.


    ఇంటికి రమ్మని చెప్పగా వాళ్ల మీద గౌరవంతో నేను మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎస్పీ గారి సలహా మేరకు ఐదు మందిని ఆఫీసర్లను సస్పెండ్ ఎందుకు చేయకూడదని కలెక్టర్ నోటీస్ ఇచ్చారు. వాళ్లు చేసిన తప్పేంటి ప్రజల కోసం త్వరగా రాత్రి అనక పగలనక కష్టపడి ప్రజల కోసం పని చేయటం వారు చేసిన తప్పా, నామాట మీద వాళ్ళు వచ్చారు ఇంతకు ముందే నా మీద ఎఫ్ ఐ ఆర్ పెట్టి ఉన్నారు కాబట్టి నన్ను అరెస్ట్  చేసుకోండి అంతేకాని వాళ్ల మీద ఈగ వాలినా నేనొప్పుకోను, ఇప్పుడు కూడా కలెక్టర్ గారి మీద గౌరవం ఉంది నెల్లూరు జిల్లా మంత్రివర్యుల కు చెబుతున్నాను న్యాయం చేయమని అన్నారు.


     కలెక్టర్ గారిని కూడా ఇంకొకసారి చెప్తున్నాను దమ్ముంటే నన్నుఅరెస్ట్ చేయండి, వాళ్ల మీద ఈగ వాలిన ఒప్పుకోను, మీడియా మిత్రులు నాకు అందరూ తెలుసు కొంతమంది యూట్యూబ్ చానల్స్ వారు దాన్ని తర్జన భర్జన చేసి టీవీ5కి, ఏబీఎన్ కి ఇచ్చి నన్ను నా పార్టీని బ్యాడ్ చేస్తున్నారు. అందుకే యూట్యూబ్ వాళ్ళకి ఆహ్వానం పలకలేదు. మరల ఒకసారి చెబుతున్నాను వాళ్ళందరు ప్రజల కోసం కష్టపడ్డ ఆ ఐదు మంది ఆఫీసర్లను ఏం చేసినా ఒప్పుకోనని అంటూ ఫైర్ అయిన ప్రసన్న కుమార్ రెడ్డి.