కుయ్ కుయ్ కు జులై 1 నుంచి మంచి రోజులు


    ఆపదలో ఉన్న వారికి మేమున్నామంటూ భరోసా ఇచ్చే 108 వాహనాలతో పాటు పల్లె ప్రజలకు వైద్యం అందించడానికి మండలానికొక 104 వాహనం జూలై 1న ఈ కొత్త వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.కుయ్ కుయ్ కు  జులై 1  నుంచి మంచి రోజులు,కొత్త 1088  అంబుల్పైన్ ల కొనుగోళ్లకే రూ.203.47 కోట్ల పైచిలుకు వ్యయం.104 వాహనాలు -676,108  వాహనాలు -412,(ఆడ్వాన్సుడ్ లైఫ్ సపోర్ట్ -104,బేసిక్ లైఫ్  సపోర్ట్-282,పిల్లల కోసం నియోనేటర్ వాహనాలు-26)


     కొత్త అంబుల్పైన్ లో ఎన్నెన్నో ప్రత్యేకతలు..పల్సాక్సీ మీటర్,ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ అంటే.. శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిని చూడటంతో పాటు పల్స్‌ రేటు చూపిస్తాయి..మల్టీపారా మానిటర్‌,ఈసీజీ స్థాయిని ఎప్పటికప్పుడు చూడటంతో పాటు ఉష్ణోగ్రతల స్థాయి, రక్తపోటు స్థాయిలను చూడొచ్చు..ట్రాన్స్‌పోర్ట్‌ వెంటిలేటర్‌,కొత్త వాహనాల్లో ఆక్సిజన్‌తో కూడిన ట్రాన్స్‌ పోర్ట్‌ వెంటిలేటర్‌ ఉంటుంది. బాధితుల పరిస్థితి విషమంగా ఉండి, శ్వాస తీసుకోలేని సమయంలో అంబులెన్స్‌లో ఉన్న ట్రాన్స్‌పోర్ట్‌ వెంటిలేటర్‌ను ఉపయోగిస్తారు..సక్షన్‌ ఆపరేటర్,ప్రమాదంలో గాయపడినప్పుడు ఊపిరితి త్తుల్లో నిమ్ము, లేదా రక్తం చేరినప్పుడు ఆ తేమను లాగేం దుకు ఈ సక్షన్‌ ఆపరేటర్‌ ఉపయోగపడుతుంది.


    ఫోల్డబుల్‌ స్ట్రెచర్స్,గతంలో ఇవి లేవు. తాజాగా తెచ్చారు. స్ట్రెచర్‌ను పూర్తిగా మడత పెట్టి తీసుకెళ్లొచ్చు. ఇది చాలా సులభంగా ఉంటుంది..సిరంజి పంపు,ప్రమాదం జరిగినప్పుడు బాధితుడికి ఐవీ ఫ్లూయిడ్స్‌ లేదా, ఇంజక్షన్లు ఎక్కించాల్సి వచ్చినప్పుడు టైమ్‌ను సెట్‌చేస్తే ఆ టైము ప్రకారం ఇది ఎక్కిస్తుంది.జూలై 1న ఈ కొత్త వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.