104 వాహనాల్లో సేవలు ఇలా
గతానికీ ఇప్పటికీ ఈ మొబైల్ మెడికల్ యూనిట్లను పూర్తి భిన్నంగా నిర్వ హించనున్నారు. ఇకపై ప్రతి పల్లెకూ నెలలో ఒకరోజు విధిగా వెళ్లాల్సిందే. మండలానికి ఒక 104 వాహనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికీ ఇది అందుబాటులో ఉంటుంది. ప్రతి 104 వాహనం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో అనుసంధానమై ఉంటుంది.ఆ పీహెచ్‌సీ పరిధిలోకి వాహనం వెళ్లినప్పుడు పీహెచ్‌సీ సిబ్బంది లేదా ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది కూడా విధిగా వాహనం వద్దకు రావాల్సిందే.
వాహనంలో డాక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు.మొత్తం 9 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారు. 20 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి.గతంలో 52 రకాల మందులు (అవి కూడా ఉండేవి కావు) ఉండగా ఇప్పుడా సంఖ్యను 74కు పెంచారు.మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక జబ్బులకు సంబంధించి ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేస్తారు.ఒకే రోజు రెండు గ్రామాలకు వెళ్లాల్సినప్పుడు ఉదయం ఒక గ్రామానికి, సాయంత్రం మరో గ్రామానికి వాహనం వెళుతుంది.
ప్రతి వాహనం విలేజి క్లినిక్‌కు కూడా అనుసంధానమై ఉంటుంది.గతంలో 104 వాహనాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 3 కిలోమీటర్లు ఆవల ఉన్న పల్లెలకు మాత్రమే వెళ్లేవి. చాలా చోట్ల నిర్వహణ సరిగా లేక నిర్ణయించిన మేరకు కూడా పల్లెలకు వెళ్లేవి కావు.నియోనేటల్ అంబులెన్స్‌లుగతంలో ఎప్పుడూ ఇలాంటి అంబులె న్స్‌లు ఏ ప్రభుత్వమూ నిర్వహించ లేదు. దేశంలో కూడా ఒకటీ లేదా రెం డు రాష్ట్రాల్లో మాత్రమే కొన్ని అందుబా టులో ఉన్నాయి. ఏపీలో 26 నియోనే టల్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.
ఒక రోజు వయసున్న పిల్లల నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు ప్రమాదం జరిగితే ఈ అంబులెన్స్‌లు అత్యాధునిక వైద్య సౌకర్యాలతో కూడిన సేవలందిస్తాయి.కొన్ని రకాల సౌకర్యాలు గతంలో ఉన్నా వాటిని నిర్వ హించక పోవడంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రికి చేరేలోపే ప్రాణాలు కోల్పోయేవారు.