చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు, జాగ్రత్తగా కరోనా భయంతో హైదరాబాద్ లో దాక్కున్నబాబు,కనీసం విశాఖ గ్యాస్ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ కోసం రాలేదు,కరోనా కష్ట కాలంలో ఏ ఒక్కరికి కనీసం సహాయం చేసిన పాపానపోలేదు. నిన్న రాత్రి హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాడు. అచ్చెన్నాయుడుతో మాట్లాడటానికి విశ్వ ప్రయత్నం చేసాడు.అయినా అచ్చెన్న మాట్లాడటానికి ఇష్టపడకపోవటంతో ,నిన్న అర్థరాత్రి హైదరాబాద్ నుండి కొడుకు లోకేష్ ని పంపి అచ్చెన్నాయుడుతో మాట్లాడించే ప్రయత్నం చేసాడు . నిన్న అర్థరాత్రి ఏసీబీ కోర్టు దగ్గర అచ్చెన్న లోకేష్ తో మాట్లాడటానికి ఇష్టపడలేదు .
దీనితో అచ్చెన్న అప్రూవర్ గా మారి తన పేరు , తన కొడుకు పేరు చెప్పేస్తాడేమోనని స్వయంగా చంద్రబాబే హైదరాబాద్ నుండి హుటాహుటిన బయలుదేరి నేరుగా గుంటూరు ఆసుపత్రికి వచ్చాడు . కలవటానికి అధికారులు ఒప్పుకోవటం లేడని పైకి చెప్తున్నా, తండ్రీ కొడుకులని కలవటానికి అచ్చెన్నాయుడు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.అచ్చెన్నాయుడును మచ్చిక చేసుకోవటానికి చంద్రబాబుపార్టీ అధ్యక్ష పదవిని కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది?తండ్రీకొడుకులు హ్యాపీగా బయటున్నారని అచ్చెన్నాయుడు తన సన్నిహితులతో వాపోతున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారాన్ని బీజేపీలో ఉన్న చంద్రబాబు బినామీ మరియు గుంటూరు జిల్లా నాయకుడు డీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది .పరిస్థితి చేయి దాటి అచ్చెన్న నోరు విప్పితే పార్టీ కూడా శాశ్వతంగా కనుమరుగవ్వటం ఖాయమని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు టాక్ అందుకోసమే తండ్రీ కొడుకు కరోనా భయాన్ని పక్కనపెట్టి హైదరాబాద్ నుండి ఆఘమేగాల మీద వచ్చి అచ్చెన్నాయుడు కోసం పడిగాపులు కాస్తున్నారని పార్టీలోని పెద్దలు బహిరంగంగానే చర్చించుకొంటున్నారు.ఈ విషయం మీద అన్ని విషయాలు తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేసి సూడాల్సి ఉంది.