నిత్యావసర సరుకులతో పాటు చల్లా యానాది కుటుంబాలకు ₹1,000/-ల ఆర్థిక సహాయం అందజేత
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, లక్ష్మీనరసింహాపురం మరియు పిడూరు పాళెం గ్రామాలలో పర్యటించి, చల్లా యానాది కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.కరోనా నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పలు దఫాలుగా ఉచిత రేషన్ అందించారు.సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించాము.
దాతలు, ముఖ్యంగా రైతులు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చూపించారు.ఆంధ్ర రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష కుటుంబాలకు పైగా "సర్వేపల్లి రైతన్న కానుక" పేరిట బియ్యం, వంటనూనెను పంపిణీ చేశాము.రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పేదల గురించి ఆలోచన చేస్తూ, ఉచిత రేషన్ తో పాటు ₹1000/-ల నగదును అందించారు.
చల్లా యానాది కుటుంబాలకు రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లేనందున ప్రభుత్వం నుండి అందాల్సిన ₹1,000/-ల నగదును అందుకోలేకపోయారు. చల్లా యానాదులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ₹1,000/-ల నగదు సాంకేతిక కారణాల వల్ల అందజేయలేక పోయినందున ఆ ₹1,000/-లను నా సొంత నిధుల నుండి అందజేస్తున్నా.రెక్కాడితే కానీ డొక్కాడని చల్లా యానాదులకు ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు.యానాదులకు అన్ని విధాలా అండగా ఉండి, వాళ్ల అభివృద్ధికి కృషి చేస్తా.