సీఎం కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు చిత్రాపటానికి పుష్ప నివాళి


    చైనా సైనికుల దాడిలోఅమరుడైన కల్నల్ సంతోష్ బాబు చిత్రాపటానికి పుష్ప నివాళి అర్పించి, కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ సూర్యాపేట వెళ్లారు.సీఎం కేసీఆర్‌,కల్నల్ కుటుంబసభ్యులతోమాట్లాడి.వీరయోధుడి కుమారుడు, కుమార్తెను కూడా పలుకరించారు. సంతోష్ భార్య సంతోషి, తల్లితండ్రులతోనూ సీఎం కేసీఆర్ కాసేపు ముచ్చటించారు.



     కల్నల్ సంతోష్ భార్య సంతోషికి  కేసీఆర్‌.. ఆమెకు గ్రూప్ వన్‌ జాబ్ అపాయింట్ ఆఫర్‌ను అందజేశారు.అయిదు కోట్ల రూపాయల చెక్‌ను కూడా అందజేశారు. జూబ్లీ హిల్స్‌లో 700 గజాల ఇంటి స్థలాల పత్రాలను కూడా సీఎం కేసీఆర్‌, కల్నల్ సంతోష్ కుటుంబానికి అందజేశారు. మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమర్ లతో కలిసి సోమవారం మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకున్న కేసిఆర్, ముందుగా సంతోష్ చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు.


    సంతోషికి రూ.4 కోట్లు, తల్లితండ్రులకు రూ.1 కోటి,జూబ్లీహిల్స్ లో 711 చ.గజాల స్థలం,గ్రూప్-1 అధికారిగా నియామక పత్రం అందచేత.సరిహద్దు గల్వాన్ లోయలో జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని సీఎం కొనియాడారు. ఆయన మరణం తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళ్లలా అండగా వుంటుందని హామీ ఇచ్చారు. ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని,సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని ఆదేశించారు.