చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి!


    మోత్కుపల్లి నరసింహులు గురించి అందరికీ తెలిసిందే దళిత నాయకుడు ఎన్టీ రామారావు గారి వీరాభిమాని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబునాయుడు గారితో కూడా కలిసి పని చేసిన నాయకుడు మోత్కుపల్లినర్సింహులు. చంద్రబాబుపై ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు అసలు ఎన్టీ రామారావు ఏ రోజైతే చనిపోయాడో ఆ రోజే పార్టీ భూస్థాపితం అయినదని.  టెక్నికల్గా పార్టీ ఉందనే గాని రామారావు గారు పెట్టిన పార్టీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని అన్నారు.


    అది రామారావుకి ఇష్టం లేదని, రామారావు గారి పెట్టిన పార్టీ నాతోనే పోవాలని, లేకుంటే నాపార్టీ నా వారసులు నడపాలని రామారావు గారి ఉద్దేశ్యం. కానీ ఆ పార్టీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని. అది ఇటువంటి నీచుల దగ్గర ఉన్న కూడదని అల్లాడిన రామారావు, 20 సంవత్సరాల తర్వాత రామారావు గారి ఆత్మ శాంతి చిందని అది జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారని సంచలన వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి. ఈ విషయం కూడా బయటకు రాకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడేనని అన్ని కులాలను వ్యవస్థలను నాశనం చేసిన ఘనత కూడా చంద్రబాబునాయుడేనని అన్నారు.


    వైయస్ కుటుంబం నమ్మినవారికి  ప్రాణం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు కుటుంబం నమ్మినవారిని ప్రాణం తీస్తుందని. జనాలకు ఆ మోసం తెలియటంవల్ల వల్లే చంద్రబాబు నాయుడు అంత ఘోరంగా ఓడిపోయారని,   దళిత నాయకుడు కాబట్టే నన్ను మోసం చేశారని తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర ఎంతో సేవ చేశానని, అటువంటి నన్నే మోసం చేశారని అందుకే ఆంధ్రప్రదేశ్లో దళిత వర్గాల ఉసురు తగిలిందని తెలుగుదేశం పార్టీ బతికే స్థితిలో కూడా లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి.