కరోనా మందు కనిపెట్టామని రాందేవ్ సంచలన ప్రకటన!


     యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి,దేశ దేశాలనే  పట్టి పీడిస్తోంది.వాక్సీన్  కనిపెట్టేందుకు చాలా దేశాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మందు అందుబాటులోకి రాలేదు. రెమడిసివిర్, హైడ్రాక్సిక్లోరోఫిన్ వంటి పలు యాంటి వైరల్ డ్రగ్స్ కొంత సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాందేవ్ బాబా సంచలన ప్రకటన చేశారు. కరోనాను తరిమికొట్టే మందును పతంజలి కనిపెట్టిందని రాందేవ్ బాబా వెల్లడించారు.కరోనా మహమ్మారికి తమ వద్ద విరుగుడు ఉందని చెప్పారు.


    ఇంటర్వ్యూలో మాట్లాడిన రాందేవ్ బాబా,గిలోయ్ (తిప్పతీగ), అశ్వగంధ మూలికలతో కరోనాను రాందేవ్ బాబా తరిమికొట్టవచ్చని తెలిపారు. కరోనా రోగులకు ఈ మూలికలతో ఆయుర్వేద చికిత్స అందించామని, వారంతా కోలుకున్నారని వెల్లడించారు. గిలోయ్, అశ్వగంధ మూలికలను ఖాళీ కడుపుతోనూ, తిన్న తరువాత కూడా రోగులకు ఇచ్చామని చెప్పారు. ఈ ఔషధం వందకు వంద శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు రాందేవ్ బాబా. శరీరం లోపల కరోనా సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడంలో తిప్పతీగ, అశ్వగంధ ప్రభావమంతంగా పనిచేసిందని రాందేవ్ తెలిపారు. 


     ప్రస్తుతం పతంజలిలో క్లినికల్ ట్రయల్స్, పరిశోధనలు జరుగుతున్నాయన్న ఆయన, త్వరలోనే శాస్త్రీయ అధ్యయనాన్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. కోవిడ్ 19 చికిత్సకు అశ్వగంధ సమర్ధవంతంగా పనిచేస్తుందని తమ పరిశోధనల్లో తేలినట్లు వెల్లడించా.ఈరామ్ దేవ్ బాబా  ప్రకటనతో భారత్ ప్రజల లోచర్చనీయాంశమైంది,యోగా గురువు రాందేవ్ బాబా మాట  ప్రపంచవ్యాప్తంగాసంచలనం కాబోతుందా .