నవరత్నాలు అమల్లో భాగంగా రాష్ట్రంలోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ. 75 వేల ఆర్థిక సహాయం అందజేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ. 18,150ల చొప్పున నాలుగేళ్ళ పాటు ప్రభుత్వం ఆర్థిక సహాయంమరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టగా కేబినెట్ ఆమోదం. ఏడాదికి రూ.10వేల చొప్పున వడ్డీలేని రుణాలను బ్యాంకుల ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.వైయస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కు కేబినెట్ ఆమోదం.
గిరిజన ప్రాంతాల్లో మరియు పేదలైన ప్రతి ఒక్క గర్భిణి, చిన్నారులకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు కేబినెట్ అంగీకారం.హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో (జీవో నంబర్ 90) చేసిన మార్పులు చేర్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. లబ్దిదారులకు ఇళ్లు ఇచ్చిన తర్వాత 5 ఏళ్లపాటు నివాసం ఉన్న తర్వాతనే అమ్ముకునేలా మార్పులు చేర్పులు చేశామని మంత్రి తెలిపారు.
గ్రేహౌండ్స్ శిక్షణా స్థలంకోసం 385 ఎకరాలు కేటాయింపుకు కేబినెట్ ఆమోద ముద్ర.ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదమద్ర.జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కురుపాం మండలంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఏపీ ఉన్నత విద్యాశాఖ ద్వారా తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం. తిరుపతిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని మంత్రి తెలిపారు.
జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియింబర్స్ మెంట్ డబ్బును నేరుగా తల్లుల అకౌంట్ లోకి జమచేయనున్న ప్రభుత్వం.గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.రైతులకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి 10వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.రామాయపట్నం పోర్టు నిర్మాణంపై రైట్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం.గండికోట నిర్వాసితులను తరలించేందుకు రూ.522.85 కోట్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం. వెలిగొండ ప్రాజక్టులో ఆర్ అండ్ ఆర్‌కు రూ. 1301.56 కోట్లు, తీగలేరు, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ భూసేకరణకోసం రూ.110 కోట్లు..మొత్తంగా రూ. 1411.56 కోట్లు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రాతః కాలంలో (తెల్లవారుఝామున) తలుపులు తీసే సన్నిధి గొల్లలకు వారసత్వపు హక్కు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఇంటిగ్రేటెడ్ రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ఏపీ ఫైబర్ నెట్, చంద్రన్న సంక్రాంతి, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా పథకాల్లో జరిగిన అవినీతిపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, సూచన మేరకు సీబీఐ దర్యాప్తుకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.
2700 నుంచి 2200 ఎకరాలకు భోగాపురం ఎయిర్‌పోర్టు కుదింపు. తాజా ఒప్పందం కారణంగా ప్రభుత్వానికి 500 ఎకరాలు వచ్చిందని మంత్రి తెలిపారు. ఎకరాకు రూ. 3 కోట్లు ధర వేసుకున్నా... ప్రభుత్వానికి రూ. 1500 కోట్ల ఆదాయం ఆదా చేసినట్లు మంత్రి వివరించారు. ఈ 500 ఎకరాలను ప్రభుత్వం కమర్షియల్ గావాడుకోనుందని తెలిపారు. ప్రభుత్వంలో అవినీతి అన్నది లేకపోతే ప్రజలకు ఎంతమేలు జరుగుతుందో పైరెండు అంశాలు నిరూపిస్తున్నయని కేబినెట్ లో ముఖ్యమంత్రి, మంత్రులు వ్యాఖ్యానించారని మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు.