రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ సేవాకార్యక్రమాలకు పెట్టింది పేరు. అదేవిధంగా నెల్లూరు రోటరీ క్లబ్ గురించి మీకందరికీ తెలిసిందే, ఎప్పుడైనా సేవా కార్యక్రమాల్లో నెల్లూరు ముందువరుసలో ఉంటుంది. ఈనాడు నెల్లూరు లో స్మశానవాటిక, దగ్గర్నుంచి పోలియో డ్రాప్స్, లేని వారికి సహాయం చేయడంలోనెల్లూరు రోటరీ క్లబ్ ముందుంది. ఈనాడు కరోనా దెబ్బకు ప్రపంచమే అల్లాడుతుంటే, పేదవానికి ఆహారము లేక అవస్థలు పడుతుంటే,వాళ్లకి ఆహారం సప్లై చేసి వాళ్లని ఆదుకోవడంలో రోటరీ క్లబ్ ముందుంది.
అంతేకాక క వలస కూలీలు ఆహారము లేక అవస్థలు పడుతుంటే వాళ్లను ఆదుకోవటం ముందు ఉంది. వాళ్లకి చిన్న పిల్లలకి బిస్కెట్లు, దగ్గరనుంచి పెద్దలకు ఆహారం,బ్రెడ్ ప్యాకెట్లు, ఇచ్చి ఆదుకోవడంలో రోటరీ క్లబ్ సేవలు మరువలేనివి. అనేక సేవలు రోటరీ క్లబ్ ముందు నుండి ప్రజల మన్ననలను పొందుతోంది. ఇప్పటికీ రోటరీ క్లబ్ లో అనేక సంవత్సరాల నుంచి కంటికి సంబంధించిన రుగ్మతలు పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు, ఉదయాన్నే సింహపురి ప్రజలు ఆరోగ్యం బాగుండాలని తలంపుతో యోగా క్లాసులు ఉచితంగా నిర్వహిస్తున్నారు.
ఈ విధంగా సేవలందిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ కు రోటరీ క్లబ్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో నారాయణ, విశ్వం, రాఘవేంద్ర, డాక్టర్ రవి, తదితరులు అందరూ కలిసి రెండువేల మాస్కులు, 250 శానిటైజర్, అందించారు. ఈ కరోనాకష్ట సమయంలో ప్రతి పేద వాడిని ఆదుకుంటూ ముందుకు పోతున్న రోటరీ క్లబ్ నెల్లూరు వారిని నెల్లూరు జిల్లా ప్రజలందరూ అభినందిస్తున్నారు మాపాఠకుల తరఫున సేవే లక్ష్యం సేవే గమ్యంగా రోటరీ క్లబ్ నెల్లూరు వారి సేవకు సలాం.