ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద సర్వే!


     ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద సర్వే చేసిన #CPS సంస్థ.గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, GHMC ఎన్నికల్లో అలాగే  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఖచ్చితమైన సర్వే ఫలితాలు ఇచ్చిన సంస్థగా CPS నిలిచింది.కరోనా మీద ప్రభుత్వ పనితీరు బాగుందని 75.8 శాతం మంది ప్రజలు తెలిపారు.జగన్ పరిపాలన బాగుందని 62.6 శాతం మంది తెలిపారు.పాదయాత్ర ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాడని 64 శాతంమంది తెలిపారు.


    సంక్షేమ పథకాలు అమలుపై 65.3 శాతం సంతృప్తి తెలిపారు.చీటికిమాటికి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడంపై 61.7 శాతం ప్రజలు ప్రతిపక్ష పార్టీలపై అసంతృప్తి వ్యక్తంచేశారు.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీల వోటింగ్ శాతం.


వైస్సార్సీపీ :        55.8%


టీడీపీ        :        38.3%


బీజేపీ+జనసేన  : 5.3%


    నెల్లూరు ,ప్రకాశం ,రాయలసీమ ప్రాంతాల్లో సుమారు 65 శాతం పైన ప్రజలు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.అమరావతి ప్రాంతంలో 50 శాతం ప్రజలు వైస్సార్సీపీ కి ,47 శాతం ప్రజలు టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు.దీన్ని బట్టి జగన్ హవా ఏ మాత్రం తగ్గ లేదని ఇంకా ప్రజా ఆదరణ పెరిగిందని అర్ధమవుతుంది.