భారత్ సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేసిన చైనాకు షాక్ ఇస్తూ మేకిన్ ఇండియాలో భాగంగా తయారైన అధునాతన విమాన విధ్వంసక వ్యవస్థ Quick Reaction Surface-to-Air Missile (QRSAM) అంటే సత్వర ప్రతిస్పందన వ్యవస్థ (క్యూఆర్ శామ్) ని సరిహద్దు మొత్తం కవర్ అయ్యేలా తూర్పు లద్దాఖ్‌లోమన రక్షణ దళం మోహరించింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఆకాష్ క్షిపణులతో కూడిన ఈ వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుందంటే.
అటునుంచి ఒక డ్రోన్, విమానం లేదా మెరుపువేగంతో ఏ మిసైలైనా బయల్దేరినా వెంటనే గుర్తించి వెంటాడి ఆకాశ్ క్షిపణులు ఢీకొని తునాతునకలు చేసేస్తాయి అచ్చం రామాయణంలో రావణాసురుడి బాణాన్ని రాముడి బాణం ఆకాశంలోనే ఛిద్రం చేయడం మనం చిన్నప్పుడు విఠలాచార్య సినిమాల్లో చూసినట్లుగా,ఇటువంటి వ్యవస్థ అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, చైనా వద్ద ఉంది ఇంతకుముందు వరకూ. అమెరికా ఈ వ్యవస్థను సౌదీలో ఏర్పరిచి నిర్వహిస్తూ డబ్బు వసూల్ చేస్తోంది.
ఇన్నాళ్లూ ఇటువంటి రక్షణ వ్యవస్థ మనదగ్గర లేదనుకుని రెచ్చిపోతున్న చైనాకి ఇప్పుడు గుండెల్లో ఆటం బాంబులు పేలుతున్నాయి.భారత్ సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేసిన చైనాకుదిమ్మతిరిగీ బొమ్మకనపడిచైనా మొహం పాలిపోయిన వేళ.భారత్ కు బలం మన జవాన్లు భారత్ ఎప్పుడు యుద్దమ్ కోరుకోదు శాంతి కామిక దేశం మనది. మజోలికి మదారికి అడ్డు తగిలితే దేనికైనా సిద్ధం.