వై ఎస్ భారతీరెడ్డి మానవత్వం మీకు తెలుసా వై.వి.రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్!


     రాజకీయాలు హద్దులు దాటి పోతున్నాయి. హద్దులు దాటి పచ్చ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు,   ప్రతి విమర్శలు సహజం. కానీ..ఆ విమర్శలు , ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య సూత్రాలకు లోబడి, కట్టుబడి  ఉండాలి. విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య విధానాలపై నమ్మకాన్ని కలిగించే విధంగా ఉండాలి. కానీ..దురదృష్టం. ప్రజాస్వామ్య సూత్రాలు కూడా తల దించుకునే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఓర్చుకోలేక పోతున్నారు. ఏదో విధంగా బురద జల్లుతున్నారు.


    కానీ.. వైఎస్‌ జగన్‌ అందరీలాంటి రాజకీయ నాయకుడు కాదు. మేధావి, మొండివాడు , నాయకుడు కలిస్తే వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి. మేధావులను మొండి వాళ్లు అంటారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఈ కోవకే చెందుతారు.  టీడీపీ శ్రేణులను చంద్రబాబు ఎంత రెచ్చగొట్టినా, ఎల్లో మీడియా ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా..సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం తొణకడం లేదు, బెణకడం లేదు. ఆయన ఆలోచనలు గ్రౌండ్ లెవల్లో అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు తన 14 ఏళ్ల సీఎంగా చేయనది ..వైఎస్‌ జగన్‌ ఏడాదిలోనే చేసి చూపించారని సామాన్యులు చెబుతున్నారు.


     వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతీ రెడ్డిని టార్గెట్ చేసింది ఎల్లో గ్యాంగ్,భారతీ ఇసుక అంటూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బజార్లో  బండి పెట్టుకుని అమ్మడం, జే టాక్స్‌ అదనం అనడంపైవైఎస్‌ఆర్‌ సీపీ సోషల్ మీడియా మాత్రం నిమ్మల రామానాయుడు, ఎల్లో గ్యాంగ్‌పై విరుచుకుపడింది. నేను 9 ఏళ్లు  సాక్షి టీవీలో పని చేశాను. వైఎస్‌ భారతీ రెడ్డి  గారి గురించి నాకు బాగా తెలుసు.  మహానేత వైఎస్ఆర్‌ మరణించిన తరువాత  వారి కుటుంబంపై కాంగ్రెస్‌ పగబట్టింది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకుని చేయని కుట్ర లేదు. అంతేకాదు..అకారణంగా, అన్యాయంగా వైఎస్‌ జగన్‌ను 16 నెలల పాటు కాంగ్రెస్‌, చంద్రబాబు కలిసి జైల్లో పెట్టారు. దిల్ ఖుష గెస్ట్ హౌజ్ దగ్గర వైఎస్‌ విజయమ్మ, భారతీ రెడ్డి, వైఎస్‌ షర్మిలను  పోలీసులు ఈడ్చిపడేయడం నా జీవితంలో మరిచిపోలేను.


    చంద్రబాబు వైఎస్‌ఆర్‌ కుటుంబాన్ని వేధించారు. అయినా...వైఎస్ భారతీ రెడ్డి గారు ఎక్కడా కృంగిపోలేదు. ధర్మాన్ని, న్యాయాన్నే నమ్ముకున్నారు భర్త వైఎస్‌ జగన్‌కు నీడగా తోడుగా, నీడగా నిలిచింది. అంతేకాదు..వైఎస్‌ భారతీ రెడ్డిగారు మంచితనానికి, మానవత్వానికి చిరునామా,ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి చలించిపోతారు. మనసు వెన్నలా కరిగిపోతుంది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటుంది. అంతేకాదు..పులివెందులలో మానసిక వికలాంగుల స్కూల్ నడుపుతున్నారు. వారికి అమ్మలా అండగా ఉంటున్నారు. వారిని భారతీ రెడ్డిగారు చూసుకున్నట్లు వారి కన్నతల్లిదండ్రులకు కూడా చూస్కోలేరేమో, కొన్ని వేల మంది పేద విద్యార్ధులను చదివిస్తున్నారు.


    వైఎస్‌  భారతీ రెడ్డి మానవతా కోణం ఎక్కువుగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ఆమె మానవత్వ విలువలు మరిచిపోరు. రాజకీయంగా ఎన్ని కష్టాల్లో  ఉన్నప్పటికీ సాక్షి పేపర్‌, టీవీలను దిగ్విజయంగా నడిపారు.  సతీమణి అండగా, ధైర్యంగా ఉంటే ఎలాంటి విజయం సాధించవచ్చో వైఎస్‌ జగన్ చేసి చూపించారు. భారతీ రెడ్డి ఓ మహిళ. తెలుగింటి ఆడపడుచు. ఉన్నత విద్య చదివి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించి తానేంటో నిరూపించుకున్న మహిళ. ఆమె నవ్వులో కల్మషం ఉండదు. మాటలో కల్మషం ఉండదు. ఎన్ని ఒత్తిళ్లనైనా చిరు నవ్వుతో ఎదుర్కొంటారు. కానీ..ఆమె ఏనాడు టీడీపీ మహిళల మీద, చంద్రబాబు కుటుంబంలోని మహిళల మీద ఓ కామెంట్ కూడా చేయలేదు. అటువంటి భారతీ  రెడ్డిగారి మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి, కామెంట్ చేయడానికి, టీడీపీ వెబ్ సైట్లో భారతీ ఇసుక అంటూ  నిమ్మల రామానాయుడు వీడియో అప్‌ లోడ్ చేయడానికి చేతులు ఎలా వచ్చాయి.