కోవిడ్ చికిత్సకోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ. 1000 కోట్లు,కోవిడ్ సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్.జగన్.మందులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది కోసం ఖర్చు.వచ్చే 6 నెలల కాలానికి వైద్య సేవలకోసం పారామెడికల్ సిబ్బంది,డాక్టర్ల నియామకం.ఇదికాక కోవిడ్‌టెస్టులు, క్వారంటైన్‌సదుపాయాలకోసం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు,మొత్తంగా 138 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స.ఈ ఆస్పత్రులన్నీ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి ,మొత్తంగా 39,051 బెడ్లు అందుబాటులోకి.
కరోనా కారణంగా తీవ్ర అస్వస్ధతకు గురైన వారి విషయంలో అత్యుత్తమ వైద్యానికి సీఎం ఆదేశాలు
అత్యంత ఖరీదైన రెమ్‌డెసివిర్, టోసీలిజుమబ్ మందులు అందుబాటులో ఉంచాలన్న సీఎంఒక్కో రోగికి ఒక్కో కోర్సుకు దాదాపు రూ.35 వేలు వరకు ఖర్చు.అయినా ఖర్చుకు వెనుకాడవద్దన్న సీఎం.విషమ పరిస్ధితులు ఎదుర్కొంటున్న వారందరికీ ఈ మందులు అందుబాటులో ఉంచాలన్న సీఎం క్రిటికల్ కేర్ కోసం రాష్ట్రస్థాయిలో అదనంగా 5 ఆస్పత్రులు,ఇప్పటికే 3 అందుబాటులోకి, మరికొన్నిరోజుల్లో మరో రెండు ఆస్పత్రులు
క్రిటికల్ కేర్ కోసం అదనంగా 2380 బెడ్లు.
కోవిడ్ వైరస్ సోకిన వారికి సత్వర, మెరుగైన వైద్య సేవలు అందాలని సీఎం శ్రీ వైయస్.జగన్ స్పష్టంచేశారు.కోవిడ్ సోకిన వారికి వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రానున్న 6 నెలల్లో పెద్ద ఎత్తున స్పెషలిస్టులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోవిడ్ నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని, ఆశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.