అన్నీ హైదరాబాద్ లో పెట్టి నష్టపోయాము మరలా అదే తప్పు చేయాలా


   తలసరి ఆదాయం ,జీడీపీ లో దేశం లో 10 వ  నగరం (సౌత్ ఇండియా లో నాలుగో నగరం)  గా ఉన్న విశాఖ పరిపాలన  రాజధాని అయితే పదేళ్లలో హైదరాబాద్ కు సమానంగా  ఆదాయం , ఉద్యోగాల కల్పన విషయం లో  తయారవుతుంది.ఇప్ప‌టికే విశాఖ‌లో ల‌క్ష మంది ప‌బ్లిక్ ప్రైవేట్ సెక్టార్‌, నేవీలో ప‌నిచేస్తున్నారు.ఇప్ప‌టికే హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌,హిందూస్థాన్ షిప్ యార్డ్‌, రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్‌, విశాఖ స్టీల్ ప్లాంట్‌, భార‌త్ హెవీ ప్లేట్స్ అండ్ వెస్సెల్స్‌, ఈస్ట‌న్ నావెల్‌ క‌మాండ్‌, ఐటీ ఇండ‌స్ట్రీ, ఫార్మా కంపెనీలు ఉన్నాయి.


    రాజధాని గా విశాఖ బెస్ట్ అంటూ అనుకూల అంశాలతో ఇండియా టుడే సైతం జనవరి 8 , 2020  న వ్యాసం రాసింది.(Why Jagan Mohan Reddy is starry-eyed about Visakhapatnam? - India Today Insight, Jan 8, 2020 )పక్కా పల్లెటూరు  అమరావతి  హైదరాబాద్ కు పోటీ నగరం  గా తయారవ్వాలంటే ఇంకో వందేళ్లు పడుతుంది. : అన్నీ హైదరాబాద్ లో పెట్టి నష్టపోయాము  మరలా అదే తప్పు చేయాలా.


  అమరావతి నిర్మణానికి లక్ష 9  వేల కోట్లు  కావాలన్న బాబు ఐదేళ్లలో 5  వేల కోట్లు ఖర్చు చేసాడు , అంటే  ఆ లెక్కన  కూడా ఇంకో వందేళ్లు పడుతుంది)ఇపుడున్న ఆంధ్రప్రేదేశ్ అప్పుల్లో కురుకొనిపోయిఉన్నది ఈపరిస్తుతుల్లో  ఇది సాధ్యం కాదు కాబట్టి సాధ్యమైనంతవరకు,ఆంధ్రప్రదేశ్ మిగతారాష్ట్రాల  రాజధానిలతో ఫొటి పడాలంటే అభివ్రుది లో దూసుకుపోవాలంటే విశాఖపట్నం బెస్ట్ రాజధాని అవుతుంది.