పాస్టర్లను అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి వ్యస్తపక అధ్యక్షుడు గడ్డం హనోక్


     పాస్టర్లకు గౌరవ వేతనం మరియు ఇల్లు కట్టించి ఇచ్చే పథకాలు వెంటనే అమలు చేయాలని DRO గారికి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డం హనోక్,ప్రధాన కార్యదర్శి రాఘవ మోసెస్ లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల వారిని ఆర్థికంగా ఆదుకుంటుందని అదే విధంగా  రాష్ట్రం కోసం, దేశం కోసం, సమాజ శ్రేయస్సు కొరకు నిరంతరం ప్రార్ధనలు చేస్తున్న పాస్టర్స్ కు  ప్రతినెల గౌరవ వేతనం మరియు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై స్ జగన్ మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ప్రకటించి ఉన్నారని ఆ పథకాలు ఇప్పటివరకు అమలు కాలేదని ఇప్పటి కైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పాస్టర్స్ ను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కె సుదర్శన్ రాజు,వై సదాశివ రావు,కోశాధికారి ఏ రమేష్,సహాయ కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.