మత్స్య సంబందిత రంగాలలోని ఉత్పత్తులు వాటి ఎగుమతులు మరియు దిగుమతుల పై కోవిడ్-19 యొక్క ప్రభావం సమస్యలను అధిగమించడం కొరకు తిసుకోవలసిన జాగ్రత్తలు మరియు పాటించవలసిన మెలకువలను, ఆక్వరంగంను ముందుకు తీసుకువెళ్ళే దిశగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మెరైన్ బయాలజీ విభాగం నందు ఇంటర్నేషనల్ వేబినార్ ను కోవిడ్ – 19 Pandamic Impact on Sustainable Fishery sector and Global trade అనే అంశము పైన సోమవారము ఉదయం 10.00 గంటల నుండి 01.30 గంటల వరకు ఆన్ లైన్ సదస్సు ను మెరైన్ బయాలజీ విభాగాధిపతి డా.సి. హెచ్. విజయా ఆధ్వర్యంలో లో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు కు ఏ.పి మరియు ఇతర రాష్ట్రాలు మరియు ఇతర దేశాల నుండి సుమారు 2000 మంది రిజిస్టర్ చేసుకున్నారని ఆర్గనైసింగ్ సెక్రటరీ డా. సి. హెచ్. విజయా తెలియజేశారు.
ఈ కార్యక్రమంను ఉద్దేశించి విశ్వవిద్యాలయ ఉప-కులపతి ఆచార్య రొక్కం సుదర్శన రావు అంతర్జాతీయంగా ఆక్వా రంగానికు మంచి ఆదరణ ఉందని కరోనా ప్రభావం ఆక్వా రంగం పైన పడడం వలన నష్టపోకుండా ఉండేందుకు ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కే. హేమచంద్ర రెడ్డి ప్రారంభ ఉపన్న్యాసం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉపన్యాసకులుగా ఆచార్య రాయ్ పాల్మెర్, వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, Association of International Sea Food Professionals, Austrilia Opportunities created by Pancemic for Indian Sea Food Industry – Time for action and change అనే అంశం పైన మాట్లాడుతూ ప్రజా జీవనంలో సముద్ర ఉత్పత్తుల ప్రాముఖ్యతను వివరించారు.
సింగపూర్ కు చెందిన డా. ఆరుళ్ విక్టర్ సురేష్ మరియు సౌదీఅరేబియా కు చెందిన డా. ఇన్నాయత్తుల్లా వివిధ అంశాల పైన ప్రసంగించారు. ఈ కార్యక్రమమును నిపుణుల అభిప్రాయం సమన్వయ కర్తలుగా ముంబై కి చెందిన డా. ఏ. వి. ఆర్ రెడ్డి మరియు ఆక్వా రంగ నిపుణులైన ఆచార్య హరిబాబు గారు వ్యవహరించారు. ఈ కార్యక్రమం లో రెక్టర్ ఆచార్య ఏం. చంద్రయ్య, రిజిస్ట్రార్ డా. ఎల్. వి. కృష్ణా రెడ్డి ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, మరియు మెరైన్ బయాలజీ అధ్యాపకులు డా. సి.హెచ్ వెంకట్రాయులు, డా. ఏం. హనుమా రెడ్డి, మరియు విద్యార్ధులు, రీసెర్చ్ స్కాలర్స్ అధ్యాపకులు మరియు ఆక్వా రంగ నిపుణులు పాల్గొన్నారు.