ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం


    నవరత్నాల్లో మరో కీలక పథకానికి కేబినెట్‌ ఆమోదముద్ర.వైయస్సార్‌ ఆసరాకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం.ఏఫ్రిల్‌ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ  డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా చెల్లించనున్నప్రభుత్వం.నాలుగేళ్లలో రూ. 27,169 కోట్లు అక్కచెల్లమ్మల చేతికివ్వనున్నప్రభుత్వం2020–21 సంవత్సరానికి రూ.6792.21 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వందాదాపు 90 లక్షల మంది లబ్ధిదారులు.సెప్టెంబరు 5 న జగనన్న విద్యా కానుక ప్రారంభానికి కేబినెట్‌ ఆమోదం.దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధిమూడు జతల యూనిఫారమ్, నోటుబుక్స్, టెక్ట్స్‌బుక్స్, ఒక జత షూ,రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్‌ బ్యాగ్‌ విద్యా కానుక కింద పంపిణీవిద్యా కానుక కోసం రూ.648.09 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.


    సెప్టెంబరు 1న వై.యస్‌.ఆర్‌. సంపూర్ణ పోషణ్‌ ప్లస్, సంపూర్ణ పోషణ్‌  ప్రారంభం.77 గిరిజన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ ప్లస్, మిగిలిన మండలాల్లో సంపూర్ణ పోషణ్‌ అమలు.గర్భవతులకు, బాలింతలకు, 6 నుంచి 36 నెలల వరకు, అలాగే 36 నుంచి 72 నెలల పిల్లలకు  పౌష్టికాహారం.ఈ కార్యక్రమాలకు ఏడాదికి రూ.1863 కోట్లు30 లక్షల మందికి లబ్ధి.గతంలో కేవలం రక్తహీనతతో ఉన్న గర్భవతులకు, బాలింతలకు మాత్రమే ఆహారం అందించగా... ఇప్పుడు అందరు బాలింతలకు, గర్భవతులకు వర్తింపు.డిసెంబరు 1నుంచి లబ్దిదార్ల గడపవద్దకే తినగలిగే  నాణ్యమైన బియ్యం అందించడానికి చర్యలు
    9260 వాహనాలు కొనుగోలు కోసం రుణాలు తీసుకునేందుకు సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం గ్యారంటీ.సార్టెక్స్‌ చేసిన నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదార్ల ఇంటి వద్దకే చేర్చేందుకు ఈ వాహనాలు వినియోగం.60శాతం సబ్సిడీ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు ఈబీసీ యువకులకు స్వయం ఉపాధి కింద ఈ వాహనాలను అందిస్తారు.వాహనాల కోసం లబ్ధిదార్లు 10 శాతం చెలిస్తే చాలు,30 శాతం బ్యాంకు రుణం కాగా 60 శాతం సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం.వై.ఎస్‌.ఆర్‌.బీమా కింద సామాజిక భద్రతా పథకం.


    సహజ మరణం పొందితే రూ.2 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు.శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు.శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలు, 51–70 ఏళ్ల మధ్య వర్తింపు.బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే వర్తించనున్న వై.యస్‌.ఆర్‌. బీమా.                                                                                            (కొరవ పార్ట్ 2లో )