3) రాజమండ్రి లో 16 ఏళ్ల బాలిక పై అత్యాచారం కేసులలో స్వయంగా పోలీసులు బాలికను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించడం తోపాటు దారుణానికి పాల్పడ్డ నిందితుల పై Cr. No. 266/2020 కేసు నమోదు చేసి అనతరం భాదితురాలికి పూర్తి స్థాయి లో న్యాయం జరిపేందుకు మహిళా అధికారిని దర్యాప్తు అధికారిణిగా నియమించి దిశ పోలీసు స్టేషన్ లోC.No.85/C3/DCRB/SC&ST/2020 నమోదు చేయడం తోపాటు వేగవంతంగా దర్యాప్తు జరిపి దారుణానికి పాల్పడ్డ నిందితులు 12 మందిని తక్షణం అరెస్టు చేయడం జరిగిందన్నారు.
4)నెల్లూరు జిల్లాలో టూరిజం ఉద్యోగిని పై తన సహోద్యోగి జరిపిన దాడి కేసులో Cr. No. 362 /20 U/s 324, 355, 354, 509 IPC & 92 (B) right of person disability act 2016, కేసులలో ముద్దాయిని అరెస్ట్ చేసి రెండు ర్టుకో ముందు పర్చగా హాజరు కోర్టులో వారాలు రిమాండు విధించిందన్నారు.
5)చిత్తూరు జిల్లాలో డాక్టర్ P. అనితారాణి కేసులో ముద్దాయిపై SC, ST అట్రాసిటి కేసు నమోదు చేసి , పారదర్శక విచారణ నిమిత్తం, కేసును CBCID కి అప్పగించడం జరిగిందన్నారు.
6)చంద్రగిరి పోలీసులు కొండిపల్లి పద్మావతమ్మ ఇచ్చిన్న ఫిర్యాదు మేరకు రాకేష్ చౌదరిని అరెస్టు చేశాం. అక్రమ అరెస్ట్ అంటూ కొంతమంది పేర్కొనడం పూర్తిగా అవాస్తవం. రాకేష్ చౌదరిపై గతంలోనే పోలీస్ స్టేషన్ లో కేసులున్నాయి. గతం లో నమోదైన కేసుల వివరాలు : CR.No. 39/2017 U/sec 323,384,506 r/w 34 IPC(దారి దోపిడి) చంద్ర గిరి పోలీస్ స్టేషన్ , Cr.No. 11/2020 U/sec 143,341,188 r/w 34 IPC తిరుచానూరు పోలీస్ స్టేషన్(అనుమతి లేకుండా రాస్తా రోకో), Cr.No 12/2020 U/Sec 341,143,188 r/w 34 IPC & 30 PA-1861(అనుమతి లేకుండా బైక్ ర్యాలీ )చంద్ర గిరి పోలీస్ స్టేషన్. ప్రస్తుతం చంద్రగిరి పోలీసులులో రాకేష్ చౌదరిపైన బాధితురాలు కొండిపల్లి పద్మావతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఆర్.నెంబర్ 223/2020 U/S 447,341,,354,509,506 R/W 34 I.P.C కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశాం. బాధితురాలు కొండిపల్లి పద్మావతమ్మ ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు వివరాలు, 2006 లో తన అత్త పద్మావతమ్మ పేరిట పొలం కొనుగోలు చేశామని , అప్పటి నుంచి టీడీపీ నాయకుడు రాకేష్ చౌదరి తమపై దాడులు చేస్తూ , పొలంలోకి రానివ్వడం లేదన్నారు .2017 లో తిరుపతి కోర్టు ఆ భూమి తమకు చెందుతుందని తీర్పు ఇచ్చినా వారి తీరు మారలేదన్నారు . ఈ నేపథ్యంలో ఈనెల 6 న మరోసారి పొలంలో మామిడి చెట్లు పెట్టేం దుకు వెళితే తన భర్త , అత్తమామలపై రాకేష్ చౌదరి , ఆయన తండ్రి రామచంద్ర నాయుడు దౌర్జన్యం చేశారని ఇచ్చిన మేరకు అరెస్టు చేశామన్నారు.
రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత: రాష్ట్ర చరిత్రలో మునుపుఎన్నడూ లేని విధంగా దళితుల పట్ల జరుగుతున్న అత్యాచార కేసులలో నిందితులను కఠినంగా శిక్షించేందుకు దోహదపడే విధంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో తీసుకువచ్చిన సంస్కరణలు, ఈ రోజు అనతికాలంలోనే రాష్ట్ర ప్రజలకు సత్ఫలితాలను ఇస్తున్నాయని సగర్వంగా మీకు తెలియజేస్తున్నామన్నారు. దళితుల పట్ల అనుచితంగా వ్యహరించిన ఘటనలలో అత్యంత వాయువేగంతో స్పందించడమే కాకుండా వారి ఫిర్యాదులపై సత్పరమే స్ఫందించి వారికి గతంలో ఎప్పుడు లేనివిధంగా అండగా, రక్షణ గా పోలీసులు ఉన్నారంటూ భరోసా కల్పించడంతో పాటు గ్రామ స్థాయి నుండి అనేక అవగాహన కార్యక్రమలను నిర్వహిస్తున్నామన్నారు.
(కొరవ పార్ట్ 3లో )