బిగ్ బ్రేకింగ్ ఏపీలో 3 ఇంటర్నేషనల్ స్టేడియాల నిర్మాణం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు


     స్ప్రెడ్ న్యూస్;-: రాష్ట్రంలో మూడు ఇంటర్నేషనల్ స్టేడియాల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర యువజన, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) తెలిపారు. ఈ నెల 20 వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నూతన పర్యాటక పాలసీని తీసుకురాబోతున్నామన్నారు. విశాఖపట్నంలోని తొట్లకొండలో బుద్ధిస్ట్ మ్యూజియంతో పాటు మెడిటేషన్ సెంటర్ నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో టూరిజం, స్పోర్ట్సు, కల్చరల్, ఆర్కియాలజీ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు.


 


    సెప్టెంబర్ మొదటి వారంలో పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకులకు అనుమతించనున్నామన్నారుఈ నెల 20 సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పర్యాటక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నూతన పర్యాటక పాలసీ తీసుకురానున్నామన్నారు. సీఎం అనుమతితో పర్యాటక శాఖలో పెండింగ్ పనులను పీపీపీ పద్ధతిలో చేపట్టే ఆలోచన ఉందన్నారు.  రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో ఒబెరాయ్ హాటల్ తరహాలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి నిర్ణయించామన్నారు. దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చంచి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. 


    రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహించడంలో భాగంగా గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా రూ.3 కోట్ల ను మంజూరు చేసి, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు వైఎస్సార్ ప్రతిభా క్రీడా పురస్కారాలు అందజేయనున్నామన్నారు. జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన వారికి రూ.5 లక్షలు, వెండి పతక విజేతకు రూ.3 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.2 లక్షల చొప్పున్న ప్రోత్సాహాకాలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.విశాఖపట్నంలోని తొట్లకొండలో బుద్ధిస్ట్ మ్యూజియంతో పాటు మెడిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.


    దేశ విదేశాల నుంచి ఎందరో పర్యాటకులు తొట్లకొండకు వస్తుంటారన్నారు. ఇటువంటి చారిత్రాత్మక ప్రాంతంలో బుద్ధిస్ట్ మ్యూజియం ఏర్పాటు చేయడం వల్ల మరింత మంది పర్యాటకలను ఆకట్టుకునే అవకాశం ఉందన్నారు. మైలవరంలోని బాపూ మ్యూజియంతో పాటు మరమ్మతుల అనంతరం సిద్ధమైన కొండపల్లి ఫోర్టును త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. సింహాచలం దేవస్థానంలో రూ.50 కోట్ల కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ పథకం కింద పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నామన్నారుఈ సమీక్షా సమావేశంలో ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండి ప్రవీణ్ కుమార్, శాప్ ఎండి బి.రామారావు, ఆర్కియాలజీ డైరెక్టర్ వాణీ మోహన్, శిల్పారామం సీఈవో జయరాజ్, సంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.