ఏపీ సీఎం మోడీ తో ఇది నిజంగా పరీక్షా సమయం

 



మోడీ జగన్ మధ్య హైలెట్ స్పీచ్ 


    ఈ సమయంలో మీరు ఇచ్చిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది, ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.మాకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి టైర్‌–1 నగరాలు లేవు. ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలిక సదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవు. అందువల్ల రాష్ట్రంలో వైద్యసదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. ఏ ఒక్కరు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండకూడదు. అదే విధంగా కోవిడ్‌ పరీక్ష అవసరమైన వారికి ఎక్కడా నిరాకరించొద్దు,అన్నదే మా లక్ష్యం. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయడం, వైరస్‌ సోకిన వారిని వేగంగా గుర్తించడం, ఆ తర్వాత వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని కూడా గుర్తించడం, తగిన వైద్య సదుపాయాలు కల్పించడంలో, క్షేత్ర స్థాయిలో 2 లక్షల మంది కీలకపాత్ర పోషించారు.వారంతా కోవిడ్‌ నివారణ చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు, అందువల్లనే అవసరం అయిన వారందరికీ టెస్టులు చేస్తున్నాం. వీటన్నింటి వల్లనే రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటను 0.90 శాతం కంటే తక్కువకే పరిమితం చేయగలిగాం.నేను ఈ విషయం చెప్పడానికి సంతోషిస్తున్నాను.అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు.