మన నెల్లూరు మన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఈ వేడుకలలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు ముఖ్య అతిధిగా పాల్గొని నిక్ క్యాడెట్స్ యొక్క గౌరవ వందనం స్వీకరించారు. తదనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పటి సామాజిక మరియు ఆర్ధిక స్థితిగతుల గురించి వివరించారు. అలాగే స్వాతత్ర్యము రావటానికి కృషి చేసిన స్వాతంత్ర్యయోధులను మరియు వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కరోనా వ్యాధి వళ్ళ అతి కొద్దిమందితో ఈ వేడుకలను నిర్వహించటం జరిగిందన్నారు.
74ఏళ్ళ క్రితం స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడితే, ఇప్పుడు కరోనా అనే మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించడానికి పోరాడుతున్నాము అన్నారు. ఈ పోరాటంలో ఎంతో ఓర్పు , శ్రమతో అచంచలమైన ఆత్మవిశ్వాసంతో సైనికుల లాగ అలుపెరుగని పోరాటం చేస్తున్న డాక్టర్లను ఆరోగ్యశాఖ సిబ్బందిని, పారిశుధ్య సిబ్బందిని,మరియు పోలీస్ శాఖ,మీడియా అధికారులకు అభినందనలు తెలియచేసారు. విశ్వవిద్యాలయం తరపున స్వచ్చందంగా, సామాజిక బాధ్యతతో జాతీయ సేవా పథకం సిబ్బంది మరియు వాలంటీర్లు హెల్ప్ ది నీడి టీం గా ఏర్పడి వారు కరోనా గురించి చేపట్టిన అవగాహనా కార్యక్రమాలను ప్రశంసించారు.
నాలుగు నెలలుగా హెల్ప్ ది నీడి టీం ఎంతో ధైర్యంతో పోరాట ప్రతిమతో గొప్పగా సామాజిక కార్యక్రమాలను చేపట్టారని. అందుకు వారిని అభినందించి ప్రశంసాపత్రాలను అందచేశారు. హెల్ప్ ది నీడి టీంకు నాయకుడిగా ముందుండి నడిపించిన బయోటెక్నాలజీ విభాగ అధ్యాపకుడు డా. ఉదయ్ శంకర్ అల్లం గారికి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య యం చంద్రయ్య గారు, రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు, ఉన్నతాధికారులు, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు హెల్ప్ ది నీడి టీం వాలంటీర్లు పాల్గొన్నారు.