నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల కేంద్రంలో సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యుల ప్రమాణస్వీకర్ణోత్సవంలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులతోపాటు గౌరవ అధ్యక్షులుగా శాసనసభ్యులకు అవకాశం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది.
రైతాంగ శ్రేయస్సు గురించి ఆలోచన చేసిన తొలి వ్యక్తి వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు అయితే, ఆ తర్వాత రైతాంగ అభివృద్ధి కోసం పని చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు, మహిళలకు 50 శాతం కేటాయిస్తూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతాంగాన్ని మోసం చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ రైతు భరోసా కింద మాట ఇచ్చిన దాని కన్నా మిన్నగా అందజేస్తున్నారు.
గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారం వెలగబెట్టి మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతుల గొంతులు కోసిన వ్యక్తులు అధికారం కోల్పోయాక గొంతు చించుకుంటూ మాపై విమర్శలకు దిగుతున్నారు. తొలి పంటకు నీరు ఇవ్వలేని ప్రబుద్ధులు, ఈనాడు రెండో పంటకు సమగ్రంగా నీరు అందించి, పండించిన ధాన్యానికి తేమ శాతం ఎక్కువగా ఉన్నా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించడం ప్రారంభం కావడంతో కడుపు మండి విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.
సర్వేపల్లి నియోజకవర్గ మార్కెట్ కమిటీకి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు పెద్దమల్లు రత్నమ్మ గారికి, ఉపాధ్యక్షులు చందులూరు శ్రీనివాసులు యాదవ్ గారికి, నియమితులైన కమిటీ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.నూతనంగా ఏర్పడినటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతుల పట్ల అంకిత భావంతో పని చేసి, రాష్ట్రస్థాయిలోనే ఉత్తమ కమిటీగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నా
పార్టీ కోసం పని చేసిన నాయకులను, కార్యకర్తలను మనసులో ఉంచుకొని అధికారం లేనప్పుడు పార్టీ జెండాను భుజాన వేసుకొని మోసిన ప్రతి ఒక్కరినీ, నా భుజాల మీద వేసుకొని మోయడానికి సిద్ధంగా ఉన్నా.