ప్రముఖ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా!


    ప్రముఖ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. సచివాలయంలో ప్రధాన సలహాదారు అజయ్ కల్లమ్  కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కె.రామచంద్రమూర్తి గురించి తెలుగు పాఠకులందరికీ తెలిసిందే.  చాలా కాలం నుండి సాక్షి లో పనిచేసిన కె.రామచంద్రమూర్తి సాక్షి పత్రిక ఎదుగుదలకు ప్రయత్నించారు. జర్నలిజంలో ప్రత్యేకత అనుభవం ఉన్న కె ఆర్ మూర్తి వివిధ పత్రికల్లో పనిచేశారు.ఆంధ్రజ్యోతి దినపత్రిక ,ఉదయం దినపత్రిక, సంపాదకుడిగా పనిచేశారు. హెచ్ఎంటీవీ లో ఉన్నత పదవిని నిర్వహించారు. సాక్షి టీవీలో ఎడిటోరియల్ డైరెక్టర్ గా పనిచేశారు. తాను రాజీనామా చేస్తానని కె.రామచంద్రమూర్తి ముందే జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. చేయడానికి పెద్దగా పని లేదని ఉత్సవ విగ్రహం ఎలాంటి పదవిలో ఉండటం తనకు ఇష్టం లేదని కె.రామచంద్రమూర్తి చెప్పినట్లు సమాచారం.