చంద్రబాబు సస్పెండయ్యారు తెలుగుదేశం పార్టీ నుండి


     తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక వెలుగు వెలిగిన నాయకుడు, తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన నాయకుడు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నుండి సస్పెండ్ చేశారా. ఇది తప్పకుండా తెలుగు ప్రజలకు షాకింగ్ న్యూసే, అయినప్పటికీ ఇప్పుడున్న ఈ లేఖని చూస్తే అవును అనిపించక మానదు. ఈ లేఖను వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బయట పెట్టడంతో తెలుగు  ప్రజలు షాకింగ్ గురవుతున్నారు.



    తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 1984 లో జరిగినా, 1995 ఆగస్టు నెల తెలుగుదేశం పార్టీకిబాడ్  అనుభవాన్ని మిగిల్చింది. అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావు కు వెన్నుపోటు పొడిచిన రోజది. ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీరామారావును దించి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఎక్కిన రోజది.కరెక్టుగా తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో పడి   దాదాపుగా ఇరవై ఆరేళ్ళు. వెన్నుపోటు పొడిచిన ఎన్టీ రామారావు కోపంగా  చంద్రబాబు నాయుడుతో సహా మొత్తం ఐదు మందిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు.


    ఇందులో చంద్రబాబు నాయుడుతో, పాటు అశోక గజపతి రాజు, విద్యాధర రావు, దేవేంద్ర గౌడ్, మాధవ రెడ్డి, వీరందరినీ సస్పెండ్ చేసినట్టు స్పీకర్కి స్వయంగా ఎన్టీరామారావు లేఖ కూడా రాశారు .1995 ఆగస్టు 25వ తేదీన ఈ లేఖ రాశారు దివంగత నేత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు .చంద్రబాబు  సస్పెండయ్యారు తెలుగుదేశం పార్టీ నుండి.ఈ లేఖ ను  ఎంపీ విజయసాయిరెడ్డి బయటపెట్టారు.