ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెల్ల మెల్లగా కుదుటపడుతుందని, ప్రస్తుత బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తాజా అప్డేట్ లో తెలిపారు. బాలసుబ్రమణ్యం ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని ప్రస్తుతానికైతే చికిత్సకు స్పందిస్తున్నారని కరోనాతో ఏర్పడిన ఇన్స్పెక్షన్ తగ్గిందని చెప్పటం బాలసుబ్రమణ్యం అభిమానులకు ఎంతో ఊరట కలిగించే అంశం. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కోసం అభిమానులు చేసిన పూజలు ఫలిస్తున్నట్లే కనబడుతోంది. ఎప్పటికప్పుడు ఆయన తనయుడు చరణ్ బాలసుబ్రహ్మణ్యం హెల్త్ గురించి బులెటిన్ తో అభిమానులకు సమాచారం ఇస్తున్నాడు.
ఎప్పుడూ హెల్త్ బులిటెన్ విన్న ఆరోగ్యం విషమంగా ఉంది, ఐసీసీ లోనే వెంటిలేటర్ మీద ఉన్నారు,అంటూ చెబుతుండేవారు కానీ తాజా బులిటెన్ లో ఆరోగ్యం మెరుగుపడిందని.ఇది నిజంగా శుభసూచకం. ఇప్పటికి కూడా బాలసుబ్రమణ్యం ఐసీయూలో వెంటిలేటర్మీద ఉన్నాకూడా మనుషులను గుర్తు పడుతుండటం. బాలసుబ్రమణ్యం కొడుకు మాట్లాడి వచ్చారని వైద్యులు ధృవీకరించారు.ప్రస్తుతానికి బాలసుబ్రమణ్యం ఆరోగ్యం బాగానే ఉందని వైద్యానికి కూడా స్పందిస్తున్నారని శివ చరణ్ చెప్పాడు.
బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం బాగుండాలని పూజలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. ఎంజీఎం డాక్టర్లకు, నర్సులకు,పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పటల్ వర్గాలు కూడా తాజా బులెటిన్ లో ఇదే విధంగా తెలిపారు.లంగ్ ఇన్స్పెక్షన్ కూడా చాలావరకు తగినట్లు ప్రచారం జరుగుతుంది. సో బాలసుబ్రహ్మణ్యం త్వరగావచ్చి అతి త్వరగా తెలుగు ప్రేక్షకులకు తన గానామృతంతో మై మరిపిస్తారని ఆశిద్దాం. ఆయన ఆరోగ్యం గురించి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్నిధ్యానం చేద్దాం.