ఏదైనా ఓ సమస్య పై ప్రజా ప్రతినిధులు వద్దకు పదిసార్లు తిరిగితే కాని సాధారణ వ్యక్తులకు పనులు కాని నేటి రోజుల్లో, నియోజకవర్గంలోని ఏ వ్యక్తి సమస్య పై ప్రజలు వెళ్ళిన వెంటనే స్పందించే ఎమ్మెల్యే గా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్న గారికి మంచి పేరుంది. " మీ ఇంటి బిడ్డగా.. మీకు సేవచేస్తా,నన్ను రెండు సార్లు గెలిపించిన మీ అందరికి రుణ పడి ఉంటా",అన్న మాటలను అక్షర సత్యాలుగా చేస్తున్నాడు. అర్థరాత్రి వేళ తన సెల్ ఫోన్లో ఫీడ్ కాని నెంబరు నుంచి కాల్ వస్తే కాల్ లిఫ్ట్ చేసేవాళ్ళు చాలా అరుదుగా వుంటారు.అది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, తెల్లవారితే స్వాతంత్ర్య దినోత్సవం రాష్ట్ర హోం మంత్రి జిల్లా కి వస్తున్న నేపథ్యంలో , జిల్లా పార్టీ అధ్యక్షుడు గా తనకున్న బిజిలో పట్టించుకోవాలంటే కొద్దిగా కష్టమే.
కాని ఆయన వ్యక్తిత్వం ఇందుకు పూర్తి గా విరుద్దం. అందుకనే ఆ ఎమ్మెల్యే అనతి కాలంలోనే ప్రజా నాయకుడుగా, నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం గా విరాజిల్లుతున్నాడు.మరోసారి ఆయన మనస్తత్వం, ప్రజల పట్ల ఆయనకు గల ఇష్టాన్ని తెలిపే సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.పొదలకూరు పట్టణంలోని నరసారెడ్డి కాలనీకి చెందిన ప్రభుత్వ టీచర్ రామకృష్ణ సోదరుడు, కి నిమోనియా, కోవిడ్ గా నిర్ధారణ అయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అతని హాస్పిటల్ లో అడ్మిట్ చేయడానికి కుటుంబ సభ్యులు జీజీహెచ్ కి వెళ్ళారు.అక్కడ బెడ్లు లేవని మరోచోటుకు తీసుకెళ్లాలని చెప్పారు. బాధితుడిని తీసుకొని నారాయణ ఆసుపత్రి కి వెళ్ళారు. అక్కడ అదే సమస్య వారికి ఎదురైంది. దాదాపు 7 గంటల పాటు వారు తిరగని చోటు లేదు.కానీ రెండు ఆసుపత్రి సిబ్బంది ఇక్కడ బెడ్లులేవు.మీరు మరో చోటుకి వెళ్ళాలని సూచించారు. రోడ్లపైన సుమారు 5 , 7 గంటలు వేచి చూశారు.
చివరికి టీచర్ రామకృష్ణ తనకి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్న గారికి బాల్య మిత్రుడైన పొదలకూరుకి చెందిన ఓ వ్యక్తికి కాల్ చేసి విషయం చెప్పాడు.అతను ఇచ్చిన సలహా మేరకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్న గారికి 11:30 సమయంలో కాల్ చేసి వారి సమస్యను తెలిపారు. ఆ సమయంలో కూడా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్న గారు వారి ఫోను లిఫ్ట్ చేసి , సమస్య ను సానుకూలంగా విని, 15 నిమిషాల్లోనే వారి సమస్య కు పరిష్కారం చూపించారు. నారాయణ ఆసుపత్రి అధికారులతో మాట్లాడి అతనికి వెంటనే వైద్యం అందేలా చేసి, ప్రత్యేక బెడ్డును సమకూర్చారు.దీంతో బాధితుల ఆనందానికి అవధులు లేవు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్న గారి అనూహ్య స్పందన తో ఓ నిండు ప్రాణం నిలబడింది. మరోసారి ప్రజా సమస్యలపై ఫోన్ చేసిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్న గారు స్పందన ఎలా వుంటుందో నియోజకవర్గ ప్రజలకు రుజువైంది.