మృతి చెందిన జర్నలిస్టులకుఏపీయూడబ్ల్యుజె ఆధర్యంలో జర్నలిస్టులకుసంతాపసభ


     కరోనాదెబ్బతో ప్రపంచమే భయపడుతుంటే, అది తెలుగురాష్ట్రాల్లో కూడాకరోనా విబృంజన కొనసాగుతున్నది.నిరంతరం వార్తల సేకరణలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు వార్తలు అందించే క్రమములో జర్నలిస్టులు 6 మంది జర్నలిస్టులు మృతి చెందారు. మృతి చెందిన జర్నలిస్టులకు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో సంతాప సభ నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయ ప్రకాష్ మాట్లాడుతూ మృతి చెందిన జర్నలిస్టులకు 50 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


     మరణించిన జర్నలిస్టుల జొన్నలగడ్డ మార్కండేయులు, వారణాసి నాగార్జున, మూర్తి, జి చక్రపాణి, దిలీప్, రమణయ్య, సంతాప సభలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రస్తుతం అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టులకు అందరికీ ప్రభుత్వ ప్రజలు నాయకులు సహకరించాలని కోరారు.జిల్లా  అధ్యక్షుడు వి వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీయూడబ్ల్యూజే ప్రయత్నిస్తోందని వాళ్ల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకూ పోరాడతామని జర్నలిస్టుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.



     ఈ కార్యక్రమంలో ఎపియుడబ్లూ జె  ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవకుమార్ , సామ్నా అధ్యక్షులు సర్వేపల్లి రామమూర్తి ,ఉపాధ్యక్షులు సుబ్బారావు ,విశాలాంధ్ర బ్యూరో సీనియర్ జర్నలిస్టు దయాశంకర్,హనూక్,ఆరవ సుధాకర్ , నేస్తం ఎడిటర్ ప్రసాద్,  తదితరులు పాల్గొన్నారు.మరణించిన జర్నలిస్టులు మన మనసులలో ఎప్పుడూ గుర్తుండి పోతారు. స్ప్రెడ్ న్యూస్ పత్రిక తరపున శ్రదాంజలి .