సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు విక్రమ సింహపురి యూనివర్సిటీలో


     సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు విక్రమ సింహపురి యూనివర్సిటీ నందు " ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న మార్పులు, వాటి పరిణామాలు" అను అంశంపై పరిశోధనలో భాగంగా ప్రిన్సిపల్ సుజా నాయర్ గారు, గైడ్లు ప్రొఫెసర్ డాక్టర్ చెంచు రెడ్డి గారు, ప్రొఫెసర్ డాక్టర్ మధుమతి గారితో సమావేశమై, ఇప్పటివరకు తాను చేసిన అధ్యయనాన్ని సమర్పించడం జరిగింది.


    ప్రిన్సిపల్, గైడ్లు, యూనివర్సిటీ సిబ్బంది సూచనలు, సలహాలతో పరిశోధనను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకొని, కార్యాచరణ ప్రారంభిస్తామని కాకాణి తెలియజేశారు.*స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందజేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారని, అత్యంత ప్రాధాన్యత కలిగిన సచివాలయ వ్యవస్థ పనితీరుపై పరిశోధన చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని కాకాణి తెలియజేశారు.