గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగు


నిర్దేశిత సమయంలోగా వినతుల పరిష్కారంపై పర్యవేక్షణ 


యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా అలర్ట్స


దీని కోసం ప్రత్యేక కాల్‌ సెంటర్


గడవు లోగా దరఖాస్తుల పరిష్కారానికి వ్యవస్థ


మొదటగా 4 సేవలపై పర్యవేక్షణ


అక్టోబరు నుంచి 543కి పైగా సేవలపై దృష్టిఅత్యంత మారుమూల ప్రాంతాల్లోని సచివాలయాలకు ఇంటర్నెట్‌ సదుపాయం ప్రారంభించిన సీఎం


పర్సుయేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ)ను ప్రారంభించిన ముఖ్యమంత్రి


సీఎం ఏమన్నారంటే....:


    రైస్‌ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎవరు దరఖాస్తు చేసినా సరే.. దాన్ని నిరంతరం ఫాలో అప్‌ చేసి పరిష్కరించే లక్ష్యంతో ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.గ్రామ సచివాలయం ఉద్యోగి నుంచి ఎమ్మార్వో, ఎంపీడీఓ, చివరకు సెక్రటరీల స్థాయి వరకూ ఫాలోఅప్‌ జరుగుతుంది.10 రోజుల్లో బియ్యం కార్డు, 10 రోజుల్లో పెన్షన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా కచ్చితంగా రావాలి.మొదటగా నాలుగు సర్వీసులను పర్సుయేషన్‌అండ్‌ మానిటరింగ్‌యూనిట్‌ (పీఎంయూ) చూస్తుంది.



    అక్టోబరు నాటికి 543కి పైగా సర్వీసులు,అన్నీ కూడా గ్రామ సచివాలయాల ద్వారా కచ్చితంగా అమలు అయ్యేలా పీఎంయూ చూస్తుంది.నిర్ణీత సమయంలోగా దరఖాస్తు పరిష్కారం కాకపోతే కారణం ఏంటనేది ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలి.వెంటనే సంబంధిత కలెక్టర్‌తో, జేసీతో మాట్లాడేలా ఉండాలి.ఆ స్థాయిలో ప్రజల వినతుల మీద దృష్టి ఉండాల్సిందే.అధికారం అనేది బాధ్యతల నుంచే వస్తుందన్న విషయాన్ని అనుక్షణం గుర్తుంచుకోవాలి.



    కాల్‌ సెంటర్‌లో ఆటోమేటిక్‌ ప్రాసెస్‌ ఉండాలి,  డేటా అనలిటికల్‌ టిక్స్‌ రావాలి.కాల్‌ సెంటరే కాకుండా దరఖాస్తుల పెండింగ్‌పై సెక్రటరీ, కలెక్టర్, జేసీ తదితర స్థాయి అధికారులకు అలర్ట్స్‌ వెళ్లేలా మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ కూడా ఉండాలి.కాల్‌ సెంటరే కాకుండా దరఖాస్తుల పెండింగ్‌పై సెక్రటరీ, కలెక్టర్, జేసీ తదితర స్థాయి అధికారులకు అలర్ట్స్‌ వెళ్లేలా మరో ప్రత్యామ్నాయ వ్యవస్థ కూడా ఉండాలి.