జర్నలిస్ట్ క్రికెట్ టీమ్ మేనేజర్ జర్నలిస్ట్ క్రికెట్ టీమ్ మేనేజర్ మూర్తి కరోనా వైరస్ తో పోరాడుతూ మంగళవారం తెల్లవారుజామున( బుధవారం) స్వర్గస్తులయ్యారు. నెల్లూరు జర్నలిస్టుల క్రికెట్ టీం మేనేజర్ మూర్తి నెల్లూరు జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టారు. మూర్తి అందరితోనూ స్నేహ భావాలు కలిగి ఉండేవారు, వృత్తిరీత్యా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల లో పనిచేసిన యాజమాన్యాల తోనూ అత్యంత చనువుగా ఉంటూ జర్నలిజం వృత్తినిసాగించేవారు.
జర్నలిజం వృత్తితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండటంతో , ఆయా రంగంలోనూ అందరికీ ఉపయోగపడే వారు. అటువంటి మంచి మనిషిని నెల్లూరు జిల్లా జర్నలిస్టులు కోల్పోవడం చాలా బాధాకరం జ్వరంతో బాధపడుతున్న మూర్తి ఈనెల 6వ తేదీనా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాడు. 8వ తేదీ పాజిటివ్ అని రిపోర్టు రావడంతో నగరంలోని జిజిహెచ్ లో చేరాడు. 9వ తేదీ మధ్యాహ్నం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని హాస్పిటల్ లోచేరారు.
అర్ధరాత్రి 2 గంటల సమయంలో మూర్తి భార్యకు ఫోన్ చేసి చనిపోయాడని సమాచారమిచ్చారు. మూర్తి మృతితో నెల్లూరులోని జర్నలిస్టులు విషాదంలో మునిగిపోయారు. మూడు రోజుల క్రితం అందరితో బాగా మాట్లాడిన మూర్తి చనిపోయాడన్న వార్తను జీర్ణించుకోలేకున్నారు.ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఏ జయ ప్రకాష్,జిల్లా అధ్యక్షుడు వి వెంకటేశ్వర్లు. సామ్నా జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఎస్ రామ్మూర్తి,గడ్డం హనోక్, మూర్తి కుటుంబానికి జిల్లా జర్నలిస్టుల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.,ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ (APEJU)రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగట్టుపల్లి శివకుమార్. జిల్లా అధ్యక్షులు ఉడతా రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శివెలసిరి కుమార్, జిల్లా కోశాధికారి పిగిలం నాగేంద్ర యాదవ్, .సామ్నా గౌరవ ప్రసిడెంట్, గోపి,ప్రసాద్ సింగ్, రమేష్ రావూరి, తదితరులు సంతాపం తెలిపారుమూర్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.