జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అందించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి


     నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కరోనా బారినపడి మృతి చెందిన జర్నలిస్టుల చిత్రపటానికి  నివాళులర్పించి, వారి కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అందించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.జిల్లాలోని జర్నలిస్టులతో నాకు ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి.కరోనానేపధ్యంలో ఆరుగురుజర్నలిస్టులను కోల్పోవడం నాకు చాలాబాధ కలిగించింది మృతి చెందిన  జర్నలిస్టులందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.



    కరోనా కాలంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీస్ సిబ్బందితో పాటు జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనది.కరోనా పై ప్రభుత్వం సూచించే జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి జర్నలిస్టులు కృషి మరువలేనిది.నిత్యం ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న జర్నలిస్టులు కరోనా బారిన పడడం దురదృష్టకరం.మాజం కోసం పనిచేసిన జర్నలిస్టుల కుటుంబాలకు కూడా సమాజం అండగా ఉంటుందనే భావన కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీ కరం చుట్టాం.



    జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలబడాలనే ఉద్దేశ్యంతో తొలి అడుగు వేశాము.మనలను వదిలి వెళ్ళిన జర్నలిస్టుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ఆత్మస్థైర్యం అందించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేసిన గౌరవనీయులు నెల్లూరు జిల్లా వై.సి.పి  అధ్యక్షులు. సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మరియు వారి కుమార్తె పూజిత గారు.ఈ కార్యక్రములోఎపియుడబ్లూజె రాష్ట్రకార్యదర్శి ఏ.జయప్రకాశ్, ఎపియుడబ్లూజెజిల్లా అధ్యక్షుడు వి .వెంకటేశ్వర్లు,పాల్గొన్నారు.