రైతు బాంధవుడిగా నిలిచారు మంత్రులు ఎమ్మెల్యేలు

 



    28-08-2020 నాడు వైయస్సార్‌ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ శంకుస్థాపన చేసిన సంగతి తెలుసు ఇందులో పాల్గొన్న మంత్రులు మాట్లాడుతూ  వేదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించడం ద్వారా రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి నిలిచారని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు ఇది ముఖ్యమంత్రిగారు పెళ్లిరోజు కానుకగా.. రైతులకోసం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టుగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు.



     ముఖ్యమంత్రి దంపతులు నూరు వసంతాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్నో సంవత్సరాలుగా కన్న కలలు ఇప్పుడు నిజంకాబోతున్నాయన్నారు. వైయస్సార్‌గారు అప్పట్లో ఈ ప్రాంతానికి మేలు చేశారని, మళ్లీ 15 ఏళ్లతర్వాత ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతానికి మేలు చేస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎకరాకు రూ.10 లక్షల రూపాయల విలువ పెరిగిందని, రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రైతుబాంధవుడిగా సీఎం నిలిచిపోతారన్నారు.


     సీఎం వచ్చిన వేళా విశేషం కారణంగా, మంచిగా వర్షాలు పడ్డాయని, నీళ్లు అందుతున్నాయన్నారు.(cm) పెళ్లిరోజున ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం వ్యాఖ్యానించారు.ఈప్రాజెక్టుద్వారా నీటికటకట తీరి, ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటూ,దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.రూ. 490 కోట్లు ఖర్చు చేస్తున్నాం నాకు ఈ అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాఅన్నారు.