బాధితులను ఆదుకోవడం అందరి బాధ్యత జయప్రకాష్


     బాధితులను ఆదుకోవడం అందరి బాధ్యత అని ఎపియుడబ్లూజె రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ అన్నారు .ఆదివారం స్థానిక గాంధీ పార్కు వద్ద కొండా బలరామిరెడ్డి 87 వ పుట్టిన రోజు సందర్భంగా కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా  ఎపియుడబ్లూజె రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ మాట్లాడారు.


     కరోనా వల్ల ప్రపంచం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని,ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు .వారిని ఆదుకునేందుకు ప్రభుత్వంతోపాటు దాతలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు .చాలా మంది ఉపాధి కోల్పోయి కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దినసరి కూలీలు పేదలు మధ్యతరగతి ప్రజలు.కరోనా వస్తే భయపడవలసిన అవసరం లేదని ధైర్యంతో ఉండాలని ముందు జాగ్రత్తతో కరీనాను నిరోధించవచ్చన్నారు.


    ప్రభుత్వ నిబంధనలతో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కేతా సుబ్బారావు మాట్లాడుతూ కొండా బలరామిరెడ్డి 87 వ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమంఏర్పాటు చేశామని ఎంతో మంది పేదలను ఆదుకుంటున్నకొండా బలరామిరెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు..ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు అందజేశారు .అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో  అడ్వకేట్ రమాదేవి ,బృందావనం పొగతోట ఆర్ డబ్ల్యూ ఏ కార్యదర్శి పి .కృష్ణమూర్తి .అనురాధ, తదితరులు పాల్గొన్నారు .