సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా, అనేక బాధ్యాతయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తి పలు సందర్భాలలో నిరాధారమైన సమాచారంతో నిరాధారమైన మాటలు మాట్లాడితే, నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై విధులు నిర్వర్తిస్తూ, పగలనక, రేయనక, ఎండనక, వాననక, ప్రజారోగ్యం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, అహో రాత్రులు శ్రమిస్తూ, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ప్రజా సేవ లో ముందు వరుసలో విధులు నిర్వర్తిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ పై ఈ విధమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని రాష్ట్ర డీజీపీ దామోదర గౌతమ్ సవాంగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనివినీ ఎరుగని రీతిలో ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ప్రజలకు విశేషమైన, విశిష్టమైన సేవలందిస్తూ తరతరాలుగా సమాజంలో అనేక రకాలుగా ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తూ వారికి అన్నివేళల తోడు, నీడగా ఉంటూ వారికి ఏ కష్టం వచ్చిన మేమున్నామంటూ భరోసా కల్పించడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రాధాన్యత , మహిళలు, చిన్నారులపైన జరుగుతున్న అత్యాచారాలకు సంభందించిన కేసులలో నిందితులను కటినంగా శిక్షించేందుకు దోహదపడే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తీసుకొచ్చి, అమలు చేస్తున్న ఎన్నో సంస్కరణలు అనంతికాలంలోనే సత్ఫ్పలితాలను ఇస్తున్నాయన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏపీ దిశ చట్టంకు అంకురార్పణ చేసి అమలు చేయటం జరుగుతుందన్నారు. ఉదాహరణకి 2019 నవంబర్ 10 న గొల్లపూడిలో జరిగిన 7 సంవత్సరముల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణ శిక్ష విధిస్తూ ఐదవ అదనపు జిల్లా మరియు స్పెషల్ జడ్జి తీర్పు పోలీసుల పనితీరుకు నిదర్శనమన్నారు.అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేసులలో పోలీసుల పనితీరుకు నిదర్శనంగా కొన్ని కేసులను ఉదహరించిన రాష్ట్ర డీజీపీ దామోదర గౌతమ్ సవాంగ్.
1) గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో గిరిజన మహిళ రమావత్ మంత్రూబాయి ని ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేసిన ఘటనపై ఫిర్యాదుపై సంబందిత పోలీస్ స్టేషన్ లో Cr.No. 131/2020 , U / S 302 IPC , Sec . 3 SC, ST ( POA ) 1989 Act తో గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరచడం జరిగిందన్నారు.
2)కర్నూలు జిల్లాలో 31-07-2020 వ రోజు ఘటన జరిగితే భాధితురాలు ఫిర్యాదు మేరకు అదే రోజు Cr. No. 198 /20 U/s 324, 355, 354 (a) ,506 r/w 34 IPC గా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీస్ స్టేషన్ లో మరల ఫిర్యాదు చేయగా తక్షణం చర్యలు తీసుకుని, కోర్టులో అనుబంధ మెమో వేయడం ద్వారా Sec 376 (D) కింద కేసు నమోదు చేసి 24 గంటల్లో ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందన్నారు. (కొరవ పార్ట్ 2లో )