సివిల్స్ విజేతలను అభినందించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్


    *క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్రానికి చెందిన 2020 సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్ధులు*సీఎంను కలిసిన పది మంది సివిల్‌ సర్వీసెస్‌ విజేతలు.సివిల్స్ విజేతలను అభినందించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్.వృత్తిలో రాణించి, ప్రజలకు ఉత్తమ సేవలు  అందించాలని, ఏ రాష్ట్ర క్యాడర్ లో పనిచేసినా మన రాష్ట్రానికి పేరు తెచ్చేలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న సీఎం


    వైద్య, ఆరోగ్యశాఖ ఆస్పత్రులలో నాడు–నేడు పై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష


    నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రులలో చేపడుతున్న మార్పులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిని అధికారులు సమావేశంలో వివరించారు.పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాళాలలకు సంబంధించి భూసేకరణతో పాటు, అవసరమైన అన్ని పనులు పూర్తయ్యాయని, టెండర్ల ఖరారుకు జ్యుడీషియల్‌ రివ్యూకు పంపిస్తున్నామని వారు తెలిపారు.


  బాపట్ల, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి, మార్కాపురం, మదనపల్లె, నంద్యాల మెడికల్‌ కాలేజీల టెండర్ల జ్యుడీషియల్‌ ప్రివ్యూ అక్టోబరులో జరుగుతుందని చెప్పారు. ఇక నరసాపురం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్‌ కాలేజీల టెండర్లను నవంబరు నెలలో జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపిస్తామని అధికారులు వివరించారు. 


    ఇంకా సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలోని ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు సంబంధించి అంచనాలు సిద్ధమయ్యాయన్న అధికారులు, రంపచోడవరంలో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రిని పవర్‌ పాయింట్‌ ద్వారా చూపారు. వీలైనంత త్వరగా ఆయా ఆస్పత్రుల పనులు కూడా మొదలవుతాయని అధికారులు వెల్లడించారు.