స్ప్రెడ్ న్యూస్ (అమరావతి)- జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం శ్రీ వైయస్ జగన్ స్పందన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలుచేసిన ఏపీ సీఎం జగన్. కేవలం చంద్రబాబుతో మాత్రమే కాకుండా, నెగటివ్ మైండ్‌సెట్‌తో ఉన్న ఎల్లో మీడియాతో కూడా పోరాడుతున్నాము. వారు మానసికంగా వ్యతిరేక ధోరణి కలిగి ఉన్నారు. వారు నెగటివ్‌గా రాసినా చదువుదాం. మనలో ఏమైనా లోపం ఉంటే సవరించుకుందాం. ఒక వేళ తప్పులు జరగకపోయినా రాస్తే, దానికి గట్టిగా సమాధానం చెప్పాలి. ప్రజల్లో ఎండగట్టాలి. కోవిడ్ నియంత్రణలో మీరు (జిల్లాల అధికారులు) చాలా బాగా పని చేశారు. అందుకు అభినందనలు.
మంచి పని చేయాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోంది. అన్యాయమైన ప్రతిపక్షం ఉండడం వల్ల ఈ దుస్థితి. పేదలకు ఇంటి స్థలం ఇవ్వడం కోసం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనుకుంటున్నాము. పెండింగ్‌లో దరఖాస్తులు ఉంటే, వాటిని కూడా వెరిఫై చేసి పంపండి. ఇదే సమయంలో ఏ సమస్యలు ఉన్నా, పరిష్కరించండి. ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధంగా ఉండండి. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి అవసరమైన మందులతో కూడిన కిట్‌ను తప్పనిసరిగా అందజేయాలి.అవి అందలేదంటే కలెక్టర్లు, జేసీలను బాధ్యులను చేస్తాము.
ధాన్యం సేకరణ సీజన్–సన్నద్ధత, మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల కోసం భూముల గుర్తింపు. రబీలో పంటల ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశం.ఉపాధి హామీ పనులు, లేబర్ బడ్జెట్, గ్రామ సచివాలయాల భవనాలు, ఆర్బీకేల నిర్మాణం, డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్‌ల ఏర్పాటు. నాడు–నేడు: పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆస్పత్రులు. గ్రామ, వార్డు సచివాలయాలు, భారీ వర్షాలు వరదలు, పంటలు, ఇతర ఆస్తుల నష్టంపై అంచనా. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ.తదితర అంశాలపై సీఎం సమీక్ష.
ఈ వరదల్లో 8 మంది చనిపోయారని తెలిసిందన్న సీఎం శ్రీ వైయస్ జగన్, ఆ కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌లను ఆదేశించారు.