(స్ప్రెడ్ న్యూస్ )నెల్లూరు ;- సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులతో మెట్ట ప్రాంతం పచ్చని మాగాణమవుతుంది.త్వరలోనే ఆపనులు చేపట్టి పూర్తి చేస్తాం.వైఎస్ఆర్ ఆసరా' పథకం ద్వారా 13.05 కోట్ల చెక్కును ఆత్మకూరు నియోజకవర్గ మహిళలకు అందించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.పాదయాత్రలో చెప్పిన సోమశిల హామీని నెరవేరుస్తా.ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు 6 టీఎంసీల నీరు అందిస్తాం.రాష్ట్ర యువత ఆశయాలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి, మంత్రి కృషి : ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిఉదయగిరి నియోజకవర్గంలో ఒక పార్క్ ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటిని విజ్ఞప్తి చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.
ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, ఆత్మకూరు ఆర్డీవో సువర్ణమ్మ, ఏపీఐఐసీ ఈడీ ప్రతాప్ రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కంచెర్ల శ్రీహరి నాయుడు,ఏఎంసీ ఛైర్మన్ అనసూయమ్మ, ఆత్మకూరు నియోజకవర్గంలోని మండలాల కన్వీనర్లు, స్థానిక నాయకులు, ప్రజలు.