కోటి జనాభా ఉన్న ఉత్తరాంధ్రకు నవశకం


     స్ప్రెడ్ న్యూస్ ;- దేశంలోని ప్రతి ప్రాంతానికి కొన్ని ప్రత్యేకతలుంటాయి. కోటి జనాభా ఉన్న  ఉత్తరాంధ్ర మరింత ప్రత్యేకమైనది.  మరి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఎందుకు వెనుకబడి ఉందంటే.. పొట్ట చేతపట్టుకుని సుదూర ప్రాంతాలకు ఎందుకు వలస పోవాల్సి వస్తోందంటే ... పాలకుల నిర్లక్ష్యమని చెప్పక తప్పదు. అలాంటి ప్రాంతానికి ఏం చేయాలి? ఈ ప్రాంతంలోనున్న ప్రత్యేకతలు ప్రపంచానికి ఎలా చాటి చెప్పాలి? సహజ వనరులను ఎలా వినియోగించుకోవాలి? 


     ఉత్తరాంధ్రలో వ్యవసాయంపై ఆధారపడ్డవారు 80 శాతం మందికిపైగా ఉన్నారు. అందుకే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకుండా... దానిపై ఆధారపడ్డవారిలో కొంతమందికి పారిశ్రామిక, సేవా రంగాలవైపు తరలించకుండా అభివృద్ధి సాధ్యం కాదు. మొత్తం నాగావళి, వంశధారలాంటి 16 నదులున్నాయ్... రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం కూడా ఇదే. అయితే ఆ నీరంతా సముద్రం పాలవుతోంది.  అందుకే పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు సాగు నీటి వసతి కల్పించేందుకు కృషి చేస్తాం. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి మా ప్రాధాన్యాల్లో మొదట ఉంటుంది.


    ఉత్తరాంధ్రకు 350 కిలోమీటర్ల పైచిలుకు తీర ప్రాంత ముంది. భావనపాడు, కళింగపట్నం నుంచి విశాఖ . గంగవరం  వరకు పోర్టుల, ఫిషింగ్ హార్బర్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉంది.  పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధికి  - ఎగుమతి దిగుమతులకు ఇవి దోహదం చేస్తాయి.  భారత దేశ తీర ప్రాంతాల్లో వెలసిన తొలి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. విశాఖ పోర్టువల్లే ఆ జిల్లాలో పరిశ్రమలు అభివృద్ధి చెందాయన్న విషయం మరవరాదు.


    .పలాస - కాశీబుగ్గ ప్రాంతంలో జీడి పరిశ్రమ - దేశంలోనే అత్యంత శ్రేష్టమైన జీడిపిక్కలుండేది పలాస ప్రాంతంలో. వేలమందికి ఉపాధి కల్పిస్తున్నాయి.  అయితే పిక్కలు దొరక్క ఇండోనేషియా, ఆగ్నేయాసియా,ఆఫ్రికా నుంచి జీడి పిక్కలు తెప్పించాల్సిన దుస్థితి వచ్చింది. ఇక్కడ పండే జీడిమామిడిలోని పిక్కను తీసుకొని... పండ్లను పారేస్తారు. కానీ ఈ పండ్లనుంచి అత్యంత శ్రేష్టమైన డ్రింక్   తయారు చేయొచ్చు. గోవాలో లభించే ఫెని డ్రింక్ అలాంటిదే. ఆ దిశగా ఆలోచనలు చేసేవారిని, పరిశ్రమలను పెట్టేవారిని ప్రోత్సహిస్తాం . కోల్డ్ స్టోరేజ్ లు రావాల్సిన అవసరం ఉంది.                                             


                                                                                                          (పార్ట్-2 లో )