జగన్ లేఖ రాసినంత మాత్రాన బాలుకు భారతరత్నవస్తుందా


     స్ప్రెడ్ న్యూస్ - నాలుగు రోజుల క్రితం మనల్ని వదిలి వెళ్లిపోయిన గానగంధర్వుడు బాలసుబ్రమణ్యం గారికి భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రప్రభుత్వానికి లేఖ రాయడం సంతోషదాయకం. ముఖ్యమంత్రి లేఖ వ్రాసినంతమాత్రాన  బాలుకు పురస్కారం ఇస్తారనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి అడగ్గానే బాలుకు భారతరత్న ఇచ్చేస్తారేమో, ఆ క్రెడిట్ జగన్ కు దక్కుతుందేమో  అన్నంతగా ఆందోళన ప్రదర్శిస్తూ బాలమురళీకృష్ణకు కూడా ఇవ్వాలనే ప్రతిపాదనలు చేస్తున్నారు.


    అలాగే మరికొందరు దివంగత ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ ముందుగా ఎన్టీఆర్ కు ఇవ్వాలని వాదిస్తున్నారు.  1954 నుంచి భారతరత్న పురస్కారాలు ప్రదానం చేస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరికి కూడా ఈ అత్యున్నత పౌర పురస్కారం దక్కలేదు.పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు రకరకాలుగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఢిల్లీలో బలమైన లాబీయింగ్ జరగాలి. నటుడుగా, రాజకీయనాయకుడిగా ఎన్టీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పినవాడే.  అయినప్పటికీ, చంద్రబాబు దుర్మార్గం కారణంగా ఎన్టీఆర్కు పురస్కారం దక్కలేదు.


     ముఖ్యంగా మన ఎంపీలుచొరవగా కేంద్రమంత్రులతో మాట్లాడాలి.ప్రధానిని కలసి ఒప్పించాలి.అందరూ కలసి ఏకధాటి మీద తెలుగోల్ల సత్తా చూపించాలి. ప్రజా అభిమానము ఉన్న ఏకైక గాయకుడు గానగంధ్వరుడు,ప్రజల మనస్సులో బాలసుబ్రమణ్యం సంపాదించుకున్న ఖ్యాతి ముందు ఎన్ని  రత్నాలూ ఇచ్చినా దిగదుడుపే.భారత రత్న బాలు కి త్వరలో రావాలని బాలు అభిమానుల తరుపున పాఠకుల తరుపున కోరుకొందాం. ఇపించాలని భారత ప్రభుత్వానికి లేఖ రాసిన ఏపీ సీఎం కి అభినందనలు తెలుపుదాం.