(స్ప్రెడ్ న్యూస్ );- విజయ డైయిరి ఎన్నికల్లో కొండ్రెడ్డి రంగారెడ్డి 86 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం ఎంతో ఆనందకరమని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నార, నెల్లూరు విజయ డైరీ లో మీడియాతో ఆయన శనివారం మాట్లాడుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి కి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ మిగిలిన రాజకీయ నాయకులతో కూడా సత్సంబంధాలు కలిగిన వ్యక్తి కొండ్రెడ్డి రంగారెడ్డి అని ప్రశంసించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అనేక విషయాలలో అండగా ఉన్నారన్నా, విజయ డైరీ కు సంబంధించి మూడు డైరెక్టర్లను వైసిపి గెలుపొందటం ఆనందకరమన్నా, రంగన్న ను ఓడించేందుకు కొంతమంది కుట్రపన్నారని ఎద్దేవా చేశారు.. వీరి కుట్రలన్నీ నిష్ఫలంగా మారాయన్నారు. రంగారెడ్డిని ఓడగట్టేందుకు ఎన్నికలో ఆయనకు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టారన్నారు, అందరి కృషితో ఎన్నికల్లో గెలిచి చూపించామని అనిల్ పేర్కొన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న దగ్గరుండి ఎన్నికలను పర్యవేక్షించడం పట్ల అభినందనలు తెలిపారు.