తెలుగు రాష్ట్రాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలి జయప్రకాష్


     స్ప్రెడ్ న్యూస్ (nellore)- ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ అన్నారు .బుధవారం స్థానిక గాంధీ పార్కు వద్ద ఎవికె ఫౌండేషన్ నిర్వహించిన ఎస్పీ బాలు సంతాప సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పదహారు భాషల్లో నలభై వేల పాటలు పాడిన మధుర గాయకుడు బాలసుబ్రహ్మణం ఒక్కరే అని అన్నారు .గతంలో ఎందరో కళాకారులకు లతా మంగేష్కర్, సుబ్బలక్ష్మి, లాంటి వరకి భారతరత్న ఇవ్వడం జరిగిందని, బాలసుబ్రహ్మణ్యం కు కూడా భారతరత్న ఇవ్వాలన్నారు .యువ గాయకులను ప్రోత్సహించేందుకు తెలుగు భాషలోని మాధుర్యాన్ని చక్కగా తెలియ చెప్పిన వ్యక్తి బాలు అని ఆయన కొనియాడారు .తెలుగు భాషకు ఎంతో ప్రచారం చేసిన ఎస్పీని సముచిత రీతిన తెలుగు రాష్ట్రాలు గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు .ఈ కార్యక్రమంలో కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు కేతా సుబ్బారావు. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.