( స్ప్రెడ్ న్యూస్ ) అమరావతి;- ఈరోజు నుండి తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పూర్తిస్థాయిలో మీడియా మిత్రులకు మీడియా పాయింట్ అందుబాటులోకి వచ్చిందని పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద కార్యాలయం వద్ద గురువారం మీడియా పాయింట్ కంటైనర్ను కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మీడియా వారికి ఉపయోగపడే లాగా మీడియా పాయింట్ ను అత్యధిక నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అత్యధిక వసతులతో ఈరోజు నుండి 24- 9-2020 నుండి పాత్రికేయులకు అందుబాటులో ఉంటుంది.
ఇందులో రెండు కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్షన్, వైఫై, రెండు ఏసీలు, కేబుల్ తో కూడిన టెలివిజన్ , మంచినీటి సదుపాయం, అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని, ఇకపై గౌరవ ముఖ్యమంత్రి కలుసుకునే మంత్రులు, వివిధ కంపెనీ ప్రతినిధులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, వారి సందేశాలను ఈ మీడియా పాయింట్ ద్వారా పాత్రికేయ మిత్రులకు అందించడం జరుగుతుందన్నారు.మీడియా వారికి ఎంతో సంతోషంగా ఉంటుందని, ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ పత్రికల సౌకర్యార్థం అని భావిస్తున్నాను అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వద్ద దీనిని చక్కగా వినియోగించుకునే బాధ్యత అందరిమీద ఉందని అన్నారు.
సమాచార శాఖ పరంగా విలేకర్ల సూచనల మేరకు భవిష్యత్తులో మరింతఆధునీకరింసు కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, విలువైన సూచనలు సలహాలు కోరుతున్నామన్నారు.ఈ మీడియా పాయింట్ ఏర్పాటు చేయడంలో సీఎం కార్యాలయ అధికారులు గణేష్, సమాచార శాఖ అధికారులు కంటైనర్ను తీసుకురావడంలో ఎంతో సహకారం అందించాలని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్, జాయింట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ ,తేల కస్తూరి,ఆర్ ఆర్ ఐఈ కృష్ణారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ సూర్యచంద్రరావు మీడియా మిత్రులు ఇతర అధికారులు పాల్గొన్నారు.