ప్రతి పక్షాలు ప్రశ్న వైస్సార్ పి పార్టీ జవాబు

ప్రతి పక్షాలు ప్రశ్న


ముఖ్యమంత్రి జగన్ ఉచిత పథకాల ద్వారా జనాలకి డబ్బులు పంచిపెడుతున్నారు కానీ ఈ 15 నెలల్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయట్లేదు



వైస్సార్ పి  పార్టీ జవాబు 



     జగన్ సీఎం అయ్యాక 11158 గ్రామ సచివాలయ భవనాలు,3809 వార్డ్ సచివాలయాల భవనాలు నిర్మించారు,ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కాదా. గ్రామ సచివాలయాలు,వార్డ్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సుమారు 4.50 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు,ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కాదా.రాష్ట్రంలో 46,788 ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పది రకాల కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం మూడు దశల్లో 12000 కోట్లు పెట్టి మన బడి నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టారు.


    తొలి దశలో రూ.3,627 కోట్ల వ్యయంతో 15,715 ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాడు- నేడు పనులు అయిపోయాయి..రెండో దశలో 14,584 స్కూళ్లలోరూ.4,732 కోట్ల వ్యయంతో పనులు చేపట్టి వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయబోతున్నారు. మూడో దశలో 16,489 స్కూళ్లలో రూ.2,969 కోట్ల వ్యయంతో పనులు చేపట్టి మార్చి నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు,ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కాదా.


    రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలని 4000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు,ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కాదా.15,337 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 7,458 హాస్పిటల్స్,PHC లని అభివృద్ధి చేయబోతున్నారు,ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కాదా.*ఇవి కాకుండా రైతు భరోసా కేంద్రాలు,విలేజ్ క్లినిక్స్ ప్రతీ ఊరిలో నిర్మిస్తున్నారు....ఇదంతా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కాదా.ఇవి కాకుండా రోడ్లు,పోర్టులు, విమానాశ్రయాలు,పరిశ్రమల అభివృద్ధి విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం.