స్ప్రెడ్ న్యూస్ ;- ఇక సెలవు సింహపురి లో జన్మించిన గాయకులు ప్రపంచం గర్వించదగ్గ గాన గంధర్వుడు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అశ్రునయనాల మధ్య కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య తామర పాక్కవుమ్ లోని సొంత ఫామ్ హౌసులో అంత్యక్రియలు పూర్తయినాయి. కన్నీటితో కడసారి వీడ్కోలు పలికిన ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు. నెల్లూరు జిల్లాలో పుట్టిన ఈ తెలుగు తేజానికి భారతదేశంలో ప్రతి ప్రముఖుడు, ప్రధాని నుంచి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఏపీ, తెలంగాణ, ముఖ్యమంత్రులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందరూ ప్రతి రాజకీయ దిగ్గజం శ్రద్ధాంజలి ఘటించారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ అంత్యక్రియలకు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. మన బాలసుబ్రమణ్యం దివికేగిన కెరటం అయినా నీ పాటలతో ఈ దేశ ప్రజల మనసులో చిరంజీవిలా ఉంటావు. మా మధ్య నీ పాటలు మాచెవులలో మారుమ్రోగుతూ మా మనసులలోఉంటావు. తెలుగు భాషకు వక్తవు, సంగీత దర్శకుడవు, తెలుగు భాషపై గౌరవం పెంచిన గాయకుడవు, నటుడవు సంగీత దర్శకుడవు,మీరు మా మధ్య భౌతికంగా దూరమైనా, మీ ఆత్మకు శాంతి కలగాలని. ఆయన కుటుంబ సభ్యులు బాధను మనసులో దిగమింగుకొని ఆయన ఆశయ సాధనకు అడుగులు వేయాలని భావిద్దాం. బాలసుబ్రమణ్యం కు ఇదే మా స్ప్రెడ్ న్యూస్ తరపున కన్నీటి శ్రద్ధాంజలి.