( స్ప్రెడ్ న్యూస్ );- నెల్లూరు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన దినేష్ కుమార్ 24 గంటలూ అందుబాటులో ఉంటానని ఏ సమస్య ఉన్నా తనకు ఫోన్ గానీ, వాట్సప్ ద్వారా గాని తెలియజేస్తే తక్షణం పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. సోమవారం ఆయన నగర పాలక సంస్థ కార్యాలయంలో నెల్లూరు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం దినేష్ కుమార్ మాట్లాడుతూఈ రోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా పదవి బాధ్యతలు సీకరించానని నెల్లూరు మున్సిపాల్టీలో పాలక సంస్థకు సంభందించి ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్ఠికి తీసుకురావాలనినను నేను 24 గంటలు అందుబాటులో ఉంటానని అన్నారు.
నెల్లూరు నగరాన్ని అభివృద్ధి విషయంలోపరుగులు పెట్టాలని, అత్యుత్తమంగా తీర్చిదిద్ధడమే లక్ష్యంగా ముందుకు పోతానని, నెల్లూరు నగర విషయం లో ఎక్కడ రాజి పడనని ఈ నెల్లూరు నగరాన్ని అతి సుందర సిటీగా తీర్చి దిద్దుతానని అన్నారు.నెల్లూరు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన దినేష్ కుమార్ గారికి నెల్లూరు ప్రజల తరుపున .స్ప్రెడ్ న్యూస్ పాఠకుల తరపున శుభాకాంక్షలు.