దేశ చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ జరగని విధంగా నామినేటెడ్ పనులు


 వైఎస్‌ఆర్‌ ఆసరా పధకాన్ని క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లాంఛనంగా ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్.


    దేశ  చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ జరగని విధంగా నామినేటెడ్ పనులు, పదవుల్లో యాబై శాతం మహిళలకు హక్కు కల్పిస్తూ చట్టం చేసిన ప్రభుత్వం మనదే. కాపు, తెలగ, బలిజ సామాజికవర్గాలకు చెందిన 45-60 ఏళ్ళ లోపు అక్కచెల్లెమ్మలకు. కాపునేస్తం కింద  ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్ళలో రూ.75వేలు అందిస్తున్నాం. దీనికి సంబంధించి మొదటి ఏడాది చెల్లింపులు కూడా జరిగాయి. అక్కచెల్లెమ్మలు బాగుంటేనే, రాష్ట్రంలోని ప్రతి కటుంబం బాగుంటుందని నమ్మిన వ్యక్తిని నేను:సీఎం. దేశ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల పేరు మీద 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించాం.గిట్టని వారు తమ పునాదులు కదిలిపోతాయనే భయంతో కోర్ట్‌ల్లో కేసులు వేసి దానికి ఇబ్బందులు కల్పిస్తున్నారు.



    దేవుడి దయతో ఆ ముప్పై లక్షల అక్కచెల్లెమ్మలకు వారి పేరు మీదే పట్టాలు, రిజిస్ట్రేషన్‌తో సహా అందిస్తాం ఎన్నికల ముందు వరకు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మొత్తం పెన్షన్లు 44 లక్షలు. ఈ రోజు రాష్ట్రంలో 60 లక్షల మందికి నెలకు రూ.2250 చొప్పున నెలకు సుమారు 1500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నెల ఒకటో తేదీన అది ఆదివారం అయినా సరే గ్రామ వాలంటీర్ ఇంటికి వచ్చి అవ్వల చేతుల్లో డబ్బులు పెడుతున్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా రక్షణ కోసం దిశా చట్టం చేశాం. మహిళల రక్షణ కోసం దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. మహిళల కోసం ఇటువంటి కట్టుదిట్టమైన చర్యలు మన రాష్ట్రంలోనే తీసుకోగలిగామని గర్వంగా చెప్పగలుగుతున్నాను.


     మద్యంను నియంత్రించి కుటుంబాల్లో ఆనందాన్ని నింపేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.పొరుగు రాష్ట్రాల కన్నా అధికంగా మద్యం ధరలను పెంచి, మద్యం కొనాలంటే షాక్ కొట్టేలా చేశాం. రాష్ట్రంలో 43వేల బెల్ట్‌షాప్‌లు, 4380 పర్మిట్ రూపంలను రద్దు చేశాం.మద్యంను నియంత్రిస్తూ... అక్కచెల్లెమ్మలకు తోడుగా వుండే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం మనదే అని గర్వంగా చెబుతున్నాను.21 శతాబ్దంలో ఆదునిక భారతీయ మహిళ ఎపిలో ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటింటా కనిపించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నా: సీఎంమూడు కోట్ల అక్కచెల్లెమ్మలు, వారి బిడ్డల భవిష్యత్తు కోసం చేయగలిగిందంతా చేస్తున్నాం.


వైఎస్‌ఆర్‌ ఆసరా పధకాన్ని క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లాంఛనంగా ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్.పాల్గొన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, కోడాలి నాని, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, ఎమ్మెల్యేలు ఆర్‌కే రోజా, విడదల రజని, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సెర్ప్‌ సీఈవో రాజబాబు, పంచాయితీ రాజ్, బీసీ సంక్షేమం, సాంఘీక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, మెప్మా అధికారులు హజరు.