గుర్రం జాషువా ఆశయాలే సమాజానికి ఎంతో అవసరం


     స్ప్రెడ్ న్యూస్;- గుర్రం జాషువా ఆశయాలే సమాజానికి ఎంతో అవసరమని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర నాయకులు కోడూరు సత్యనారాయణ అన్నారు .సోమవారం కస్తూరి దేవి కళాక్షేత్రంలో గల గుర్రం జాషువా విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 125 వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .గుర్రం జాషువా దేశాన్ని దేశభక్తిని సమాజాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదని కేవలం కులతత్వాన్ని నిరసించాలన్నారు .సమాజం అభివృద్ధి చెందకపోవటం దుకు దేశం నష్టపోవటం దుకు కులమే కారణమని ఆయన పేర్కొన్నారు .ఆనాటి చైనా దురాక్రమణను ఎదిరించిన మహోన్నత వ్యక్తి జాషువా అని ఆయన కొనియాడారు .విద్యార్థులు యువతలో దేశభక్తిని పెంచటంతోపాటు కులతత్వాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు .ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్, రాష్ట్రీయ స్వయం సేవక్ నాయకుడు రామదండు సామాజిక సమరసత వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరావు సీనియర్ జర్నలిస్టు మాధవరావు,  అంకయ్య,లక్ష్మినారాయణరెడ్డి, సామ్నా జిల్లా ప్రధాన కార్యదర్శి జి .హనూక్  న్యాయవాది  రమాదేవి తదితరులు పాల్గొన్నారు.